సీఎం జగన్ కీలక నిర్ణయం.. పేదలకు మరో అద్భుత వరం..

సంక్షేమ పథకాల అమలులో దూకుడుగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసిన ఆయన, నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి రెడీ అయ్యారు.

news18-telugu
Updated: December 31, 2019, 10:01 AM IST
సీఎం జగన్ కీలక నిర్ణయం.. పేదలకు మరో అద్భుత వరం..
జగన్ (ఫైల్)
  • Share this:
సంక్షేమ పథకాల అమలులో దూకుడుగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసిన ఆయన, నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి రెడీ అయ్యారు. ఉగాది పర్వదినాన 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం వైసీపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అందుకు ప్రభుత్వ భూములను కేటాయించడంతో పాటు ఇతర ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు, వ్యక్తులకు పెద్ద ఎత్తున భూములను కేటాయించింది. ఆ భూముల్లో నిరూపయోగంగా ఉన్నవాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు కసరత్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను తమ ఆధీనంలో ఉంచుకున్న వారి నుంచి కూడా భూములను స్వాధీనం చేసుకోనున్నారు.

అదేవిధంగా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల్లో నిరూపయోగంగా ఉన్న వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే, కలెక్టర్లు వివిధ జిల్లాల్లో నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించి ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి పంపించారు. ఈ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని ఇళ్ల పట్టాలుగా మార్చాలని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆదేశాలలో పేర్కొంది.

First published: December 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు