ఏపీ సీఎం జగన్ పొదుపు మంత్రం... అసలు కారణం చెప్పిన రోజా...

AP New CM YS Jagan : ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన జీతంగా నెలకు ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 30, 2019, 7:10 AM IST
ఏపీ సీఎం జగన్ పొదుపు మంత్రం... అసలు కారణం చెప్పిన రోజా...
ఎమ్మెల్యే రోజా, వైఎస్ జగన్
  • Share this:
ఏపీ కొత్త ముఖ్యమంత్రి అవుతున్నారే గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఆనందం లేదు. అందుకు కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితే. గత ప్రభుత్వం అద్భుతంగా పరిపాలించినట్లు చెబుతున్నా... పోలవరం ప్రాజెక్టుకో, పథకాల కోసమే కారణం ఏదైనా... ప్రస్తుతం రాష్ట్రం రూ.2 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లో ఉంది. ఇక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణ స్వీకారం చెయ్యగానే... రాష్ట్ర పాలనా బాధ్యత ఆయనపై పడుతుంది. అంటే ఓ ముళ్ల కిరీటాన్ని ఆయన నెత్తిన పెట్టుకుంటున్నట్లే అనుకోవచ్చు. ఆయన ముందు రెండు టార్గెట్లు. ఒకటి రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచీ బయటపడెయ్యడం, రెండోది... వైసీపీ ఇచ్చిన హామీలను అమలు చెయ్యడం. ఈ సవాల్‌ ఎలాగైనా అధిగమించాలనుకుంటున్న ఆయన... వీలైనంతవరకూ ఖర్చులు చెయ్యకుండా పొదుపు మంత్రం పాటించాలని అనుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకూ అందరికీ ఇదే విషయం చెప్పి, అందరూ ఈ రూల్ పాటించాలని కోరినట్లు తెలిసింది.

రాష్ట్ర సీఎంగా జగన్ తలచుకుంటే... హైఎండ్ లైఫ్ స్టైల్ అనుభవించొచ్చు. కానీ ఆయన అందుకు సిద్ధంగా లేరు. దీనికి కారణం పొదుపు మంత్రమే అంటూ నగరి ఎమ్మెల్యే రోజా... జగన్ ఆలోచనా ధోరణి ఎలా ఉందో చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిలాగా జగన్ దుబారా ఖర్చులు చెయ్యరని అన్నారామె. చంద్రబాబు దుబారా ఖర్చుల వల్ల రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందన్న ఆమె... తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి రూపాయికీ జవాబుదారీ ఉంటారని అన్నారు. అందుకే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా సాదీ సీదాగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్నందుకు నెలకు రూ.4,21,000 జీతం తీసుకుంటున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రూ.2,40,000 జీతం తీసుకునేవారు. జగన్ మాత్రం నెలకు రూపాయి మాత్రమే తీసుకుంటున్నట్లు వైసీపీ వర్గాలు ప్రకటించాయి. ఇలా పొదుపు విషయంలో తాను ఎంత సీరియస్‌గా ఉన్నదీ జగన్ సీఎం కాక ముందే సంకేతాలు పంపారు. పొదుపు చర్యల్లో భాగంగా... ఢిల్లీలో మోదీ ప్రమాణస్వీకారానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, కేసీఆర్‌తో కలిసి... ఒకే విమానంలో వెళ్లబోతున్నారు జగన్.

ఇకపై కూడా జగన్ ఇలాగే చెయ్యబోతున్నారని తెలిసింది. నేతలు, ప్రభుత్వాధికారులూ తమ అనవసర ఖర్చులను తగ్గించుకుంటే... వందల కోట్ల రూపాయలు ఆదా అవుతాయనీ, వాటిని ప్రభుత్వ పథకాల కోసం ఉపయోగించవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తన పర్యటనలకు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల వంటివి అత్యవసరమైతే తప్ప, వీలైనంత వరకూ వాడకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలాగే స్టార్ హోటళ్లలో స్టే చెయ్యడాలూ, అదే పనిగా విదేశీ పర్యటనలు వంటివి జగన్ చెయ్యరని తెలుస్తోంది.

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్... ఇలాగే పొదుపుగా ఉంటూ... ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అత్యంత సాదాసీదాగా ఉండే ఆయన్ను ప్రజలు ఐదోసారి గెలిపించుకున్నారంటే ఆయన పట్ల ఓటర్లు ఎంత ప్రేమాభిమానాలతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగన్ కూడా అలాంటి సీఎంల బాటలో నడవాలనుకుంటున్నట్లు తెలిసింది. అదే జరిగితే రాష్ట్రానికీ మంచిదే.

 

ఇవి కూడా చదవండి :నవరత్నాలపై జగన్ తొలి సంతకం...? ఇవాళ్టి నుంచే అమలు...

రెండోసారి మోదీ ప్రమాణస్వీకారం... ప్రత్యేకతలు ఇవీ...
First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading