చేనేత, మత్స్యకారులకు గుడ్‌న్యూస్.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.12వేలు, న్యాయవాదులకు రూ.5వేలు ప్రోత్సాహకం అందించేందుకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

news18-telugu
Updated: October 16, 2019, 3:28 PM IST
చేనేత, మత్స్యకారులకు గుడ్‌న్యూస్.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
వైఎస్ జగన్
  • Share this:
ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేనేత కార్మికులు, మత్స్యకారులు, న్యాయవాదులపై వరాల జల్లు కురిపించారు సీఎం జగన్. వైఎస్సార్ చేనే నేస్తం పథకం కింద చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి ఏడాది డిసెంబరు 21న ఒకే విడతలో ఈ మొత్తాన్ని అందిస్తారు. చేనేత నేస్తం పథకం ద్వారా రాష్ట్రంలోని 90వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.12వేలు అందిస్తామని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. తెప్పలపై చేపల వేటకు వెళ్లే వారికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే:

వైఎస్సార్ నేస్తం పథకం కింద చేనేత కార్మికులకు ఏటా ఒకే విడతలో రూ.24వేల ఆర్థిక సాయం.

చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.12 వేల సాయం. వారికి డిజిల్ సబ్సిడీ రూ.9 అందిస్తాం.

న్యాయవాదులకు మూడేళ్ల పాటు నెలకు రూ.5వేల గౌరవ వేతనం. డిసెంబరు 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా పథకం ప్రారంభిస్తాం.

జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తాం. ప్రతి కుటుంబానికి 110 నుంచి 150 లీటర్లు రక్షిత మంచి నీరు అందిస్తాం.

మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాన్ని రూ.1000 నుంచి 3వేలకు పెంపు. 88,296 మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది.హోంగార్డు దినసరి వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కి పెంచుతూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

పలాసలో 200 పడకల కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్  5 రెగ్యులర్, 100 కాంట్రాక్ట్, 60 ఔట్ సోర్సింగ్ నిమామకాల భర్తీకి అనుమతి.

ప్రతి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గానికి బోర్ వెల్ యంత్రాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం.

నిరుద్యోగ యువతకు  బీసీ, ఎస్టీఎస్టీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై వాహనాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా బ్యాంకు ఖాతాలోకే జీతాలను చెల్లించాలని నిర్ణయం.

ఏపీఎస్ ఆర్టీసీలో 3500 కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి. వాటి స్థానంలో కొత్త బస్సులను తీసుకుంటాం. అందుకోసం రూ.1000 కోట్ల లోన్ తీసుకునేందుకు మంత్రిమండలి తీర్మానం చేసింది.

చిరు ధాన్యాలు,అపరాలు,కొబ్బరి కొనుగోలుకు బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం.

 

 

 
Published by: Shiva Kumar Addula
First published: October 16, 2019, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading