విద్యుత్తు బిల్లులపై సీఎం జగన్ కీలక నిర్ణయం..

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

ఏపీలో విద్యుత్తు బిల్లులపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30వరకు విద్యుత్తు బిల్లుల చెల్లింపులను వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.

  • Share this:
    ఏపీలో విద్యుత్తు బిల్లులపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30వరకు విద్యుత్తు బిల్లుల చెల్లింపులను వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో విద్యత్తు బిల్లులు అధికంగా రావడంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. దీంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం. వివరాల్లోకెళితే.. కరోనా దెబ్బకు గత నెలలో కరెంటు బిల్లు ఇవ్వలేదు. రెండు నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, 500 యూనిట్లు దాటే సరికి టారిఫ్ మారిపోవడంతో ప్రజలకు బిల్లు వేలకు వేలు వచ్చింది. దీంతో వినియోగదారులు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

    లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడం, దీనికితోడు ఎండలు ముదురుతుండడంతో విద్యుత్తు వినియోగం పెరిగింది. మార్చి, ఏప్రిల్ నెలలకు కలిపి తిరుపతిలోని ఓ వినియోగదారుడికి ఈ నెలలో రీడింగ్ తీస్తే 531 యూనిట్లు వచ్చింది. ఆ యూనిట్ల ప్రకారం టారిఫ్ మారి రూ.2,542 బిల్లు వచ్చింది. అందులో ఫిబ్రవరిలో సగటు విద్యుత్తు వినియోగం ఆధారంగా చెల్లించిన రూ. 450 మినహాయించి మిగతా బిల్లును చేతిలో పెట్టారు. అనంతపురంలో ఓ వ్యక్తికి కూడా రూ.2,522 బిల్లు వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి రీడింగ్ తీస్తుండడంతో అది 500 యూనిట్లు దాటిపోతోంది. ఫలితంగా టారిఫ్ మారిపోయి యూనిట్‌కు రూ.9.95 వసూలు చేస్తుండడంతో ప్రజలు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: