జగన్ జైలుకు వెళ్లడం ఖాయం...యనమల జోస్యం

వైఎస్ జగన్, యనమల రామకృష్ణుడు..(ఫైల్ ఫోటోలు)

పరిపాలనపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలని యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. వైసీపీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు.

  • Share this:
    ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. సీబీఐ కోర్టు విచారణకు వెళ్తే... రూ. 60 లక్షలు ఖర్చవుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగత కేసుకు ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేస్తుందని యనమల ప్రశ్నించారు. వైసీపీ నేతలు సైతం జగన్ ఎప్పుడు జైలుకు వెళతారా ? అని ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. పరిపాలనపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలని యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. వైసీపీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు.

    జగన్ పాలనలో అధికారులు, మంత్రులు నామమాత్రం అయ్యారని మండిపడ్డారు. జగన్‌కు ఆర్థిక వ్యవస్థ గురించి తెలియదని... ఆయనకు ఆర్థిక నేరాలు ఎలా చేయాలో తెలుసని యనమల దుయ్యబట్టారు. అమరావతి, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    First published: