Home /News /politics /

Andhra Pradesh: జగన్ ఆయనను చూసి నేర్చుకోవాలన్న జనసేన ముఖ్యనేత.. ఇలాగైతే కష్టమేనంటూ..

Andhra Pradesh: జగన్ ఆయనను చూసి నేర్చుకోవాలన్న జనసేన ముఖ్యనేత.. ఇలాగైతే కష్టమేనంటూ..

నాదెండ్ల మనోహర్ (ఫైల్ ఫోటో)

నాదెండ్ల మనోహర్ (ఫైల్ ఫోటో)

కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఇసుక మాఫియా కోసమే ఎత్తలేదని, ఇసుక మాఫియా స్వార్ధానికి ప్రజలు బలి అయ్యారని ఆయన మండిపడ్డారు.

    సీఎం జగన్ వర్క్ ఫ్రమ్ హోమ్ మానేసి ప్రజల మధ్యలో తిరగాలని జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ సూచించారు. అధికారులు చెప్పిన లెక్కలు విని పరిపాలిస్తే జగన్ భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ 68 ఏళ్ల వయస్సులో గొడుగు పట్టుకుని ప్రజల మధ్య తిరుగుతుంటే.. 48 ఏళ్ల జగన్ ఇంట్లో కూర్చుని పరిపాలిస్తున్నారని తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా జరిగిన నష్టంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక హాస్యాస్పదంగా ఉందని జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ అన్నారు. వరదల కారణంగా 76 మంది మృతి చెందారని, 5లక్షల ఎకరాల్లో పంట నీటి మునిగిందని, మొత్తం రూ.6054 కోట్లు నష్టపరిహారం కావాలంటూ కేంద్రానికి ఏపీ సర్కార్ నివేదిక ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. సీఎం జగన్‌వి కాకి లెక్కలని, గాల్లో తిరిగే హెలికాప్టర్ లెక్కలని ఆయన ఆరోపించారు.

    కడప జిల్లాలో 459 పశువులు వరదల కారణంగా మృతి చెందాయని.. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. వైసీపీ నాయకులు వరద బాధితులకు ధైర్యమివ్వకపోగా వరద సహాయంపై అస్పష్టతకు గురు చేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభ సమావేశాలు ఎందుకు పొడిగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించేందుకేనా వైసీపీకి ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఇసుక మాఫియా కోసమే ఎత్తలేదని, ఇసుక మాఫియా స్వార్ధానికి ప్రజలు బలి అయ్యారని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్‌కు పరిపాలనా దక్షత లేదని, వైసీపీ దాటవేత ధోరణి తప్ప ప్రజలకు సాయం చేయాలనే ఆలోచన లేదని విమర్శించారు. భాధితులకు సహాయం అందించక పోతే చిత్తూరు కలెక్టర్‌కి రెండు కోట్ల రూపాయలు నిధులు ఎందుకు విడుదల చేశారని ఆయన ప్రశ్నించారు.

    Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

    Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

    కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

    Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

    అన్ని సందర్భాలలో జనసేన స్పందించిందని, జనసేన ఎప్పుడూ వెనుక అడుగు వేయదన్నారు. రేపటి నుండి జనసేన పార్టి అమరావతి రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు. రేపటి నుండి అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటామని ఆయన స్పష్టం చేశారు. పాతకక్షలు తీర్చుకునేందుకు శాసన సభ సమయాన్ని వృద్దా చేయద్దని ఆయన కోరారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Janasena

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు