Home /News /politics /

మంత్రులతో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

మంత్రులతో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్(File)

ఏపీ సీఎం జగన్(File)

టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకు వచ్చిన అప్పుల వరకూ పైస్థాయిలో ఏదిచూసినా వందలు, వేలకోట్ల రూపాయల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయని మంత్రివర్గ ఉపసంఘంతో జరిపిన సమావేశంలో సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై పోరాటంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు. ఒత్తిళ్లను అస్సలు పట్టించుకోవద్దని ఆయన సూచించారు. తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని ఆయన మంత్రులతో అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకు వచ్చిన అప్పుల వరకూ పైస్థాయిలో ఏదిచూసినా వందలు, వేలకోట్ల రూపాయల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయని సీఎం ఆరోపించారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతిచేసినవారిని వదిలేయాలా ? అని వ్యాఖ్యానించారు.

    ఇళ్ల నిర్మాణం తీసుకున్నా అదే పరిస్థితి ఉందన్నారు. అవినీతి లేకుంటే అదే ఇళ్లు, తక్కువ ఖర్చుకు లభించేవి కాదా ? అని జగన్ మంత్రులతో అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు. దీని వల్ల మిగిలే ప్రతిపైసా ప్రజలకే చెందుతుందని గుర్తుంచుకోవాలని మంత్రులకు స్పష్టం చేశారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతిరహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించాలని మంత్రులకు జగన్ సూచించారు.

    ఈ సమావేశానికి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్‌ కల్లాం, సలహాదారులు శామ్యూల్, సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, ఇతర ఉన్నతాధికారులు, అధికారులు హాజరయ్యారు.




    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Polavaram, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు