మీ అత్తగారే.. చంద్రబాబుకు చురకలంటించిన జగన్..

సీఎం జగన్ నామినేటెడ్ పోస్టుల్లో నియమించిన వారి వివరాలను సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి పేరు చదువుతూ రోజా, లక్ష్మీ పార్వతి గురించి ప్రస్తావించారు.

news18-telugu
Updated: December 11, 2019, 11:31 AM IST
మీ అత్తగారే.. చంద్రబాబుకు చురకలంటించిన జగన్..
చంద్రబాబు, సీఎం జగన్
  • Share this:
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రక్తికట్టిస్తున్నాయి. స్పీకర్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు.. సస్పెన్షన్‌ చేయాలంటూ వైసీపీ నేతల డిమాండ్.. చంద్రబాబును స్పీకర్ మన్నించి వదిలేయడం.. ఇలా అన్ని సంఘటనలు ఆసక్తి రేపుతున్నాయి. మూడో రోజు సభ ప్రారంభం కాగానే.. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ టీడీపీ ఆందోళన చేపట్టింది. స్పీకర్‌కు, చంద్రబాబుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు నోరు జారారు. మర్యాదగా ఉండదంటూ వ్యాఖ్యానించడం సభలో గందరగోళాన్ని సృష్టించింది. అయితే.. ఈ వ్యవహారం సద్దుమనిగాక సీఎం జగన్ నామినేటెడ్ పోస్టుల్లో నియమించిన వారి వివరాలను సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి పేరు చదువుతూ రోజా, లక్ష్మీ పార్వతి గురించి ప్రస్తావించారు.

లక్ష్మీపార్వతి పేరు ప్రస్తావిస్తున్న క్రమంలో ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమించామని చెప్పారు. వెంటనే ‘ఆమె.. ఆయన(చంద్రబాబు) అత్తగారే’ అంటూ టీడీపీ అధినేతకు చురకలు అంటించారు. ఈ మాట అనగానే సభలో ఉన్న వైసీపీ నేతలందరూ చప్పట్లతో, బల్లలు చరుస్తూ నవ్వేశారు. ఇలా.. సభ అత్యంత ఆసక్తికరంగా మారింది.

First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>