అక్టోబర్ 1 నాటికి బెల్ట్ షాపులు బంద్... సీఎం జగన్ ఆదేశం

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ ఆదేశించారు. సమాజానికి మంచి చేసే నిర్ణయాలు అమల్లో అడుగులు ముందుకు పడాల్సిందే అన్నారు.

news18-telugu
Updated: June 25, 2019, 12:43 PM IST
అక్టోబర్ 1 నాటికి బెల్ట్ షాపులు బంద్... సీఎం జగన్ ఆదేశం
కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్
news18-telugu
Updated: June 25, 2019, 12:43 PM IST
ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి ప్రజావేదికలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో భాగంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 1 నాటికి రాష్ట్రంలో ఉన్న అన్ని బెల్ట్ షాపుల్ని పూర్తిగా ఎత్తివేయాలన్నారు. జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాలు ఉండొద్దన్నారు. దాబాల్లో కూడా లిక్కర్ అమ్మకాలు జరపొద్దన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ ఆదేశించారు. సమాజానికి మంచి చేసే నిర్ణయాలు అమల్లో అడుగులు ముందుకు పడాల్సిందే అన్నారు.

ఉండవల్లిలోని ప్రజా వేదిక లో మంగళవారం కలెక్టర్లు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ కాల్ మనీ,సెక్స్ రాకెట్ వ్యవహారాలపై కూడా వ్యాఖ్యలుచేశారు. ఎస్పీ లతో , కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం లా అండ్ ఆర్డర్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ విషయంలో సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. ఏ పార్టీ పారు ఉన్నా విడిచిపెట్టొద్దన్నారు. పోలీస్ వ్యవస్థను క్లీన్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు.ఎవరికైనా ఫిర్యాదు ఉంటే వెంటనే తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమన్నారు జగన్.

First published: June 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...