ఏపీలో శాసన మండలి రద్దు చేసే ఆలోచనలో జగన్ ?

మండలిని రద్దు చేస్తే టీడీపీ సభ్యులైన లోకేష్, యనమల, రాజేంద్రప్రసాద్ తో పాటు ముఖ్య నేతలు పదవులు కోల్పోయే అవకాశం ఉంది. దీంతోనే ఆ దిశగా జగన్ అడుగులు వేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: December 22, 2019, 10:06 AM IST
ఏపీలో శాసన మండలి రద్దు చేసే ఆలోచనలో జగన్ ?
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో జగన్... శాసనమండలిని రద్దు చేస్తారన్న ఊహాగానాలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం మండలిలో టీడీపీదే ఆధిక్యం. తెలుగుదేశంలో నియమితులైన షరీఫ్‌ మండలి అధ్యక్షుడుగా ఉన్నారు. ప్రస్తుతం శాసనస మండలిలో టీడీపీకి 28 మంది సభ్యులుండగా... వైసీపీ సభ్యులు తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. పీడీఎ్‌ఫకు ఐదుగురు, బీజేపీ సభ్యులు ఇద్దరు, ఇండిపెండెంట్లు ముగ్గురు సభ్యులు ఉన్నారు. మండలిలో వైసీపీకి మెజారిటీ రావాలంటే 2021 దాకా ఆగాలి. ఇప్పుడు అసెంబ్లీలో అధికార పక్షం వ్యూహాలకు... మండలిలో టీడీపీ ప్రతివ్యూహాలు రచిస్తోంది.


ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి శాసనసభలో ఆమోదించిన ఆంగ్ల మాధ్యమం బిల్లు, ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు బిల్లులకు మండలిలో టీడీపీ సవరణలు ప్రతిపాదించింది. ‘మాధ్యమాన్ని ఎంచుకున్న అవకాశం తల్లిదండ్రులు/విద్యార్థులకు ఉండాలని... ఎస్సీ కమిషన్‌ బిల్లులో వర్గీకరణనూ చేర్చాలని పట్టుపట్టింది. ఇంగ్లీషు మీడియం బిల్లులో సవరణలకు ఇతర పక్షాలూ మద్దతు పలికాయి. మండలిలో విపక్షానిదే పైచేయి కావడంతో సవరణలు భారీ ఆధిక్యంతో ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లులను అసెంబ్లీకి తిప్పి పంపాల్సి వచ్చింది. ఈ బిల్లులపై మండలిలో విపక్షాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించిన మంత్రులు... ‘మీరు వ్యతిరేకిస్తే మండలిని రద్దు చేస్తాం’ అని కూడా హెచ్చరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.సీఎం జగన్ తొలసారి మండలిలో అడుగుపెట్టినప్పుడు కూడా టీడీపీ సభ్యుల నుంచి ఎదురైన ప్రశ్నలతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన మండలికి వెళ్లడం లేదని సమాచారం. మండలిని రద్దు చేస్తే టీడీపీ సభ్యులైన లోకేష్, యనమల, రాజేంద్రప్రసాద్ తో పాటు ముఖ్య నేతలు పదవులు కోల్పోయే అవకాశం ఉంది. దీంతోనే ఆ దిశగా జగన్ అడుగులు వేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో మండలిని రద్దు చేస్తే ఇటు వైసీపీ ముఖ్య నేతలు, జగన్‌కు అత్యంత సన్నిహితులైన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ కూడా పదవువులు కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో మండలి రద్దు విషయంలో జగన్ ఆచితూచి అడుుగులు వేస్తున్నారు.


First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు