అమరావతిపై సీఎం జగన్ కొత్త ప్లాన్... జనవరిలో అఖిలపక్ష సమావేశం?

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు... నాలుగు ప్రాంతాలుగా విభజన అనే అంశంపై అఖిలపక్షాలతో చర్చించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. అలాగే అమరావతి అభివృద్ధి కోసం ఓ ప్లాన్ రెడీ చేస్తున్నారు.

news18-telugu
Updated: December 22, 2019, 5:31 AM IST
అమరావతిపై సీఎం జగన్ కొత్త ప్లాన్... జనవరిలో అఖిలపక్ష సమావేశం?
వైఎస్ జగన్
  • Share this:
GN రావు కమిటీ సిఫార్సులు... అమరావతిలో అగ్నిజ్వాలలు రగిలిస్తున్నారు. ఐదు రోజులుగా రైతులు ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. దీంతో అమరావతిపై దృష్టిసారించిన జగన్ ప్రభుత్వం... దాంతోపాటూ.... విశాఖ, విజయవాడ, కర్నూలు ప్రాంతాల అభివృద్ధికి ఓ ప్లాన్‌ రెడీ అవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో తుళ్లూరుతో కలిపి రాజధాని అమరావతి ప్రతిపాదిత 29 గ్రామాలకు 217 చదరపు కిలోమీటర్లతో మహానగర ఏర్పాటు, 8,603 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ఏర్పాటుకి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్లను సింగపూర్ కంపెనీలు ఇచ్చాయి. ఇందుకు ఆ ప్రభుత్వం రూ.900 కోట్లు ఖర్చు పెట్టింది. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఐదు దశల్లో రాజధాని అభివృద్ధికి డిజైన్లు రూపొందించింది. 2029 నాటికి రాజధాని పూర్తయ్యేలా టార్గెట్ పెట్టుకుంది. అమరావతిని 21 జోన్లుగా విభజించింది. ఆ తర్వాత చాలా జరిగాయి. తాజా ప్రభుత్వం ఈ మొత్తం ప్రక్రియను పక్కన పెట్టింది. మరో మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. అదే 25 జిల్లాల ఏర్పాటు. అందులో భాగంగా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లిని విజయవాడకు కలిపేయాలనుకుంటోంది. తుళ్లూరులో రాజధాని కోసం సేకరించిన 33,500 ఎకరాల్లో అన్ని రకాల వసతులూ కల్పించి... విద్యా సంస్థల్ని తెచ్చి... ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలనుకుంటోంది. తుళ్లూరులో SRM, విట్ వంటి నేషనల్ ప్రైవేటు విద్యా సంస్థలు ఆల్రెడీ ఉన్నాయి. మంగళగిరిలో ఎయిమ్స్ రానుంది. అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేతో పాటు కృష్ణానదిపై మరో రెండు వంతెనల్ని ప్రభుత్వం నిర్మించాలనుకుంటోంది. తద్వారా అమరావతి అభివృద్ధి అవుతుందన్నది తాజా ప్లాన్.

రాజ్‌భవన్, హైకోర్టు బెంచ్, శాసనసభ, మంత్రుల నివాసాలు అమరావతిలోనే ఉంటాయనీ, భూములు ఇచ్చిన రైతులకు ఇబ్బందులేవీ ఉండవని ప్రభుత్వం చెబుతోంది. తుళ్లూరు అభివృద్ధికి ఓ నిపుణుల కమిటీని నియమించే ఛాన్సుంది. గుంటూరు జిల్లాలో మిగిలిన ప్రాంతాన్ని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతీయ అభివృద్ధి మండలి పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. GN రావు కమిటీ సిఫార్సులపై 27న మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. వచ్చే నెల మొదటి వారంలో పాలనా వికేంద్రీకరణపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి... ప్రతిపక్షాలు తమతో కలిసొస్తాయో, లేదో తేల్చుకోవాలనుకుంటోంది ప్రభుత్వం.

First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు