ఆమంచి, నందిగాం సురేష్‌కు వైఎస్ జగన్ బంపర్ ఆఫర్

ఆమంచి కృష్ణ మోహన్ చీరాల నుంచి ఓడిపోయినా కూడా ఆయన మీద జగన్ మోహన్ రెడ్డికి గురి ఉన్నట్టు ఈ ఘటనను చూస్తే అర్థం అవుతోంది.

news18-telugu
Updated: August 10, 2019, 6:14 PM IST
ఆమంచి, నందిగాం సురేష్‌కు వైఎస్ జగన్ బంపర్ ఆఫర్
తాడేపల్లిలో వైసీపీ ఆఫీసును ప్రారంభిస్తున్న ఆమంచి కృష్ణ మోహన్, నందిగాం సురేష్
news18-telugu
Updated: August 10, 2019, 6:14 PM IST
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌కు మంచి అవకాశం ఇచ్చారు. అమరావతిలోని తాడేపల్లిలో నిర్మించిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించారు. ఆఫీసు రిబ్బన్ కటింగ్ వారిద్దరి చేత జరిపించారు. పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ ఆఫీసును ప్రారంభించే అవకాశం జగన్ మోహన్ రెడ్డికి ఉంది. అయితే, ఆయన మాత్రం వారిద్దరి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. మీరే రిబ్బన్ కట్ చేయాలని మిగిలిన వారు, నందిగాం సురేష్, ఆమంచి కృష్ణ మోహన్ కోరినా కూడా వారి చేతికే కత్తెర ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. రిబ్బన్ కట్ చేయించారు.

ఆమంచి కృష్ణ మోహన్ చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయినా కూడా ఆయన మీద జగన్ మోహన్ రెడ్డికి గురి ఉన్నట్టు ఈ ఘటనను చూస్తే అర్థం అవుతోంది. దీంతో పాటు ఇటీవల ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మధ్య ఇసుక రీచ్‌లకు సంబంధించి వివాదం జరిగిందని, దీంట్లో నందిగాం సురేష్‌కు జగన్ క్లాస్ పీకారంటూ ప్రచారం జరిగింది. సురేష్‌ను పక్కన పెట్టారంటూ వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం జగన్ ఇచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి చూస్తే ఆయనకు జగన్ వద్ద ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గలేదని అర్థం అవుతోంది. దీంతోపాటు నందిగాం సురేష్, ఆమంచి కృష్ణ మోహన్‌‌ చేత కొత్త ఆఫీసును ప్రారంభింపజేయడం ద్వారా అటు దళితులు, ఇటు కాపులకు జగన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారనే సందేశాన్ని ప్రజల్లోకి పంపించారు.

First published: August 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...