Home /News /politics /

AP CM YS JAGAN MOHAN REDDY VISIT IDUPULAPAYA SB

ఇడుపులపాయకు సీఎం జగన్... వైఎస్ ఘాట్ వద్ద నివాళి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రార్థనల అనంతరం జగన్‌ ఇడుపులపాయలో పర్యటించనున్నారు. గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

    కడప జిల్లాలో పర్యటిస్తున్నా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయకు చేరుకున్నారు. అక్కడ వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, ఇతర కుటుంబ సభ్యులతోపాటు ఘాట్‌కు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఘాట్‌ వద్దకు భారీగా చేరుకున్న అభిమానులకు జగన్ అభివాదం చేశారు. ప్రార్థనల అనంతరం జగన్‌ ఇడుపులపాయలో పర్యటించనున్నారు. గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తిరిగి ఇడుపులపాయ చేరుకుని అక్కడి నుంచి జమ్మలమడుగుకు బయలుదేరి వెళ్లనున్నారు జగన్. 11.15 గంటలకు జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చెరుకుని రైతు దినోత్సవంలో పాల్గొంటారు.

    ఈ సభలో వైఎస్సార్ పింఛన్ కానుకను అందజేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. దీంతో పాటు రైతులకు పలు కీలక ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం. తిరిగి 1.30 గంటలకు జమ్మలమడుగు నుంచి హెలికాప్టర్ ద్వారా కడప విమానాశ్రయం చేరుకుని విజయవాడకు చేరుకుంటారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఇతర ఉన్నతాధికారులు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Kadapa, YSR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు