జగన్ నెక్ట్స్ టార్గెట్... వారిపై సీరియస్... మంత్రులతో చర్చ

పొలిటికల్ కరప్షన్ తగ్గిందనే భావనలో ఉన్న సీఎం జగన్... అధికారుల స్థాయిలో మాత్రం అవినీతి ఆశించిన స్థాయిలో తగ్గుముఖం పట్టలేదనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 13, 2019, 7:18 PM IST
జగన్ నెక్ట్స్ టార్గెట్... వారిపై సీరియస్... మంత్రులతో చర్చ
సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
రాజకీయంగా తనదైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అవినీతిని ఎంత మాత్రం సహించబోనని పదే పదే చెబుతున్నారు. ఈ విషయంలో మంత్రులకు వార్నింగ్ ఇవ్వడానికి సైతం జగన్ ఏ మాత్రం మోహమాటపడటం లేదనే టాక్ వినిపిస్తోంది. అవినీతికి దూరంగా ఉండాలని సీఎం జగన్ గతంలో ఇద్దరు ముగ్గురు మంత్రులకు క్లాస్ తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా అధికారుల స్థాయిలో జరుగుతున్న అవినీతి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భావనలో సీఎం జగన్ ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన తన కేబినెట్ మంత్రుల దగ్గర కూడా ప్రస్తావించారు.

ప్రభుత్వంపై అవినీతి ముద్ర ఎంత మాత్రం పడడానికి వీల్లేదన్న సీఎం జగన్... పొలిటికల్ కరెప్షన్ దాదాపు కంట్రోల్ అయిందనే భావనలో ఉన్నారు. అయితే పొలిటికల్ కరెప్షన్ తగ్గినా.. అధికారుల స్థాయిలో కరెప్షన్ తగ్గలేదన్న పలువురు మంత్రులు జగన్ దగ్గర అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దీంతో అధికారుల అవినీతికి అడ్డుకట్ట వేయాలని సీఎం జగన్ భావిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. స్పందన కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా కూడా సీఎం జగన్ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.

అవినీతి నిర్మూలనకు చిత్తశుద్ధితో పని చేస్తున్న విషయాన్ని అంతా గమనించాలని అన్నారు. రెండు, మూడు వారాలల్లో ఏసీబీని రంగంలోకి దించుతామని సీఎం హెచ్చరించారు. అవినీతిపై పోరాటాన్ని అగ్రెసివ్‌గా తీసుకోవాలని... అవినీతికి చోటు లేదన్న విషయం కింది స్థాయి అధికారులకు చేరాలని అన్నారు. వచ్చే రెండు మూడు వారాల్లో పెద్ద ఎత్తున ఏసీబీని దించుతున్నామని సీఎం జగన్ అన్నారు.



First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com