సీఎం హోదాలో తొలిసారి కడపకు జగన్... సోమవారం పర్యటన

ఈ సభలో వైఎస్సార్ పింఛన్ కానుకను అందజేయనున్న ముఖ్యమంత్రి. దీంతో పాటు రైతులకు పలు కీలక ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: July 7, 2019, 1:03 PM IST
సీఎం హోదాలో తొలిసారి కడపకు జగన్... సోమవారం పర్యటన
సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా సోమవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  తన తండ్రి దివంగత మహానేత వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన అక్కడి వెళ్తున్నారు. వైఎస్ జయంతి ని రాష్ట్ర రైతు దినోత్సవం గా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఉదయం 8.10 కి విజయవాడ నుంచి ప్రత్యేక విమానం ద్వారా కడప విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు.ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయ వెళ్లనున్నారు జగన్. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ ను సందర్శించి తన తండ్రి వైఎస్ కు నివాళులర్పించనున్నారు.

ఇడుపులపాయ నుంచి రోడ్డు మార్గాన 9.35 గంటలకు గండికు చేరుకోనున్నారు జగన్. గండి వీరంజనేయ స్వామి దర్శించి ప్రత్యేక పూజలు...చేయనున్నారు. గండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తిరిగి ఇడుపులపాయ చేరుకుని అక్కడి నుంచి జమ్మలమడుగుకు బయలుదేరి వెళ్తారు. 11.15 గంటలకు జమ్మలమడుగు లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చెరుకుని రైతు దినోత్సవం లో పాల్గొంటారు.

ఈ సభలో వైఎస్సార్ పింఛన్ కానుకను అందజేయనున్న ముఖ్యమంత్రి. దీంతో పాటు రైతులకు పలు కీలక ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం. తిరిగి 1.30 గంటలకు జమ్మలమడుగు నుంచి హెలికాప్టర్ ద్వారా కడప విమానాశ్రయం చేరుకుని విజయవాడకు చేరుకుంటారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఇతర ఉన్నతాధికారులు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: July 7, 2019, 1:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading