Home /News /politics /

AP CM YS JAGAN MOHAN REDDY TO VISIT IDUPULAPAYA DUE TO YS DEATH ANNIVERSARY SB

నేడు ఇడుపులపాయకు జగన్... వైఎస్ వర్థంతి కార్యక్రమంలో సీఎం

సీఎం వైఎస్ జగన్

సీఎం వైఎస్ జగన్

సెప్టెంబర్ 2వ తేదీ 2009లో చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన వైఎస్... హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు

    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కడప జిల్లాకు వెళ్లనున్నారు. ఇడుపులపాయలో జరిగే తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్సార్ కు నివాళులు అర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడి నుంచి జగన్ విజయవాడ పయనమవుతారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

    సెప్టెంబర్ 2వ తేదీ 2009లో చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన వైఎస్... హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఉదయం గం.9.35 నిమిషాలకుహెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. ఈ ఘటనలో వైఎస్ సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర మంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Kadapa, YSR, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు