HOME »NEWS »POLITICS »ap cm ys jagan mohan reddy to visit delhi today he may meet pm modi amit shah sk

YS Jagan Delhi Tour: నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్.. హోంమంత్రి అమిత్ షాతో కీలక భేటీ..

YS Jagan Delhi Tour: నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్.. హోంమంత్రి అమిత్ షాతో కీలక భేటీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్)

ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలతో పాటు పలు అంశాలపైనా హోమంత్రితో వైఎస్ జగన్ చర్చించనున్నారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతోనూ జగన్ సమావేశమవుతారని తెలుస్తోంది. అపాయింట్‌మెంట్ దొరికితే ప్రధాని మోదీతోనూ భేటీ అవుతారని సమాచారం.

  • Share this:
    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.  మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. అక్కడ నుంచి ఢిల్లీకి  వెళ్తారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వీరి సమావేశానికి సంబంధించి అపాయింట్‌మెంట్ ఖరారైందని.. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం. ఏపీలో తాజా పరిణామాలతో పాటు పలు అంశాలపైనా హోమంత్రితో వైఎస్ జగన్ చర్చించనున్నారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతోనూ జగన్ సమావేశమవుతారని తెలుస్తోంది. అపాయింట్‌మెంట్ దొరికితే ప్రధాని మోదీతోనూ భేటీ అవుతారని సమాచారం.

    ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షాకు జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. విగ్రహాల ధ్వంసం వెనక రాజకీయ కుట్ర ఉందని నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ఒకవేళ ప్రధాని మోదీతో భేటీ అయితే జమిలి ఎన్నికలపైనా చర్చించే అవకాశముంది. జమిలి ఎన్నికలపై సీఎం జగన్ ఇప్పటికే పూర్తి స్పష్టత ఉన్నారని.. తన అభిప్రాయాన్ని కేంద్ర పెద్దలకు చెప్పే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



    మరోవైపు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ ఏపీ సీఎం జగన్ సమావేశమవుతారని తెలుస్తోంది. పెండింగ్ నిధులతో పాటు ప్రాజెక్టులు పూర్తయ్యేలా బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని ఆర్థికమంత్రిని ఆయన కోరే అవకాశముంది. మొత్తంగా సీఎం జగన్ ఆకస్మిక హస్తిన పర్యటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published:January 19, 2021, 04:55 IST