డిసెంబర్ 21న... జగన్ బర్త్ డే రోజు.. ఏపీలో కొత్త పథకం...

1972 డిసెంబర్ 21న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో ప్రారంభించారు.

news18-telugu
Updated: October 10, 2019, 6:55 PM IST
డిసెంబర్ 21న... జగన్ బర్త్ డే రోజు.. ఏపీలో కొత్త పథకం...
వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే పథకాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో ప్రారంభించబోతున్నారు. అనంతపురంలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్రంలో అంధత్వాన్ని నివారించేందుకు ఈ పథకాన్ని తెచ్చామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా వైద్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ‘ఉత్తరాంధ్రలో కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రాలు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. మార్కాపురం, పిడుగురాళ్ల, మచిలీపట్నం, ఏలూరు, పులివెందులతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య డేటాను తయారు చేస్తాం. ప్రతి ఒక్కరికీ ఓ కార్డు ఇస్తాం. డిసెంబర్ 21న (ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు) అందరికీ కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తాం. లబ్ధిదారులకు సంబంధించిన హెల్త్ డేటా అందులో ఉంటుంది. ఆ కార్డుతో ఏ ఆస్పత్రికి వెళ్లినా.. వారి అనారోగ్య సమస్యల డేటా మొత్తం తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి సమూలంగా మార్చేస్తున్నాం. ప్రస్తుతం ఆరోగ్య శ్రీలో 1000 వ్యాధులు ఉన్నాయి. వాటిని పెంచుతున్నాం. డెంగ్యూ, మలేరియా వంటి వాటిని కూడా అందులోకి తీసుకొస్తాం.’ అని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.

ఆరోగ్య శ్రీలోకి మొత్తం 2వేల వ్యాధులను తీసుకొచ్చి జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు అమలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

1972 డిసెంబర్ 21న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో ప్రారంభించారు. వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని నిరుపేదలు, పెద్ద జబ్బులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఆరోగ్య శ్రీ పథకం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకానికి పేరు మార్చి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ అని పేరు పెట్టారు.

కపిల్ దేవ్‌తో చంద్రబాబు కబుర్లుFirst published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు