త్వరలోనే ప్రజాదర్బార్... వైఎస్ఆర్ బాటలో జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పులివెందులలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజాగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజు నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు.

news18-telugu
Updated: June 12, 2019, 2:54 PM IST
త్వరలోనే ప్రజాదర్బార్... వైఎస్ఆర్ బాటలో జగన్
సీఎం వైఎస్ జగన్
news18-telugu
Updated: June 12, 2019, 2:54 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో ప్రజాదర్బార్‌ను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన సీఎం కార్యాలయం అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి రోజూ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరగంట సేపు ప్రజలను కలుసుకోనున్నారు. వారి నుంచి వినతులను స్వీకరించి... అక్కడికక్కడే పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని సంబంధితత శాఖ అధికారులకు పంపుతారు. ఎప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతారనే అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది.

ఇక సీఎం జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూడా ఇదే రకంగా సామాన్యులు తనను కలుసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతి రోజు ఉదయం కొంతసేపు సామాన్యులను కలుసుకుని వారి సమస్యలు విన్న వైఎస్ఆర్... వాటికి పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించేవారు. అయితే ఆ తరువాత ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వాళ్లెవరూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేదు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పులివెందులలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు వినేవారు. తాజాగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజు నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు.


First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...