• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP CM YS JAGAN MOHAN REDDY STARTED FROM TADEPALLI TO ATTEND KALESHWARAM PROJECT INAUGURATION SB

తాడేపల్లి టూ మేడిగడ్డ... కాళేశ్వరానికి బయలుదేరిన సీఎం జగన్

తాడేపల్లి టూ మేడిగడ్డ... కాళేశ్వరానికి బయలుదేరిన సీఎం జగన్

కేసీఆర్ ఈ స్థాయిలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో... సీఎం జగన్ ఈ విషయంలో ఏ రకంగా స్పందిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ విషయంలో జగన్ కూడా సానుకూలంగానే ఉంటూ వచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తరువాత, కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలోనూ వైఎస్ జగన్ పాల్గొంటారు.

  • Share this:
    ప్రత్యేక హెలికాప్టర్‌లో తెలంగాణకు బయల్దేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కాళేశ్వరం ప్రారంభంలో ఆయన పాల్గొననున్నారు. ఏపీ సీఎం జగన్‌తో పాటు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీంతో జగన్ కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డకు బయలుదేరారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ భూపాలపల్లికి చేరుకున్నారు. మరికాసేపట్లో మేడిగడ్డ వద్దకు కేసీఆర్ వెళ్లనున్నారు. ఆపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సైతం అక్కడికి చేరుకోనుండగా, కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తరువాత, కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలోనూ వైఎస్ జగన్ పాల్గొంటారు. మధ్యాహ్న భోజన అనంతరం జగన్ తిరిగి అమరావతికి బయలుదేరుతారు.

    తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేశారు. ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంపు హౌజులు, వంద‌ల కిలోమీట‌ర్ల కాలువ‌లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్త‌గా నీరిస్తారని అధికారులు చెబుతున్నారు. దారి పొడ‌వునా ఉండే గ్రామాల‌కు, హైద‌రాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు నీరు ఇవ్వాలనీ ప్రణాళిక రూపొందించారు. . నిర్మాణ రంగ చరిత్రలో అద్భుతాలు సృష్టిస్తూ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టారు. దీంతో, అన్ని రికార్డులు బద్దలు కొట్టే దిశగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్‌ చేసింది. ఎంతో మంది ప్రశంసలందుకుంది.
    Published by:Sulthana Begum Shaik
    First published: