నవ్వుల పాలైన సీఎం జగన్... అభిమానుల ఆగ్రహం

ఒకవేళ టీడీపీ ముందుకొచ్చి ప్రయాణఖర్చులన్నీ తాము పెట్టుకుంటామంటే అప్పుడు సీఎం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతారా? అనే ప్రశ్న కూడా రాజకీయ పరిశీలకులు వేస్తున్నారు.

news18-telugu
Updated: September 7, 2019, 9:24 PM IST
నవ్వుల పాలైన సీఎం జగన్... అభిమానుల ఆగ్రహం
ఏపీ సీఎం జగన్(File)
news18-telugu
Updated: September 7, 2019, 9:24 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణకు సంబంధించి తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేనంటూ ఆ కేసులో నిందితుడు అయిన వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలని, తన తరఫున న్యాయవాది కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరవుతారని స్పష్టం చేశారు. దీనిపై కోర్టు నిర్ణయం ఏంటనేది ఈనెల 20న తెలిసే అవకాశం ఉంది. అయితే, అసలు తాను విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాలేకపోవడానికి ఆయన చెప్పిన కారణాల్లో ఒకటి మాత్రం జగన్ మోహన్ రెడ్డిని నవ్వుల పాలు చేసింది. తాను ముఖ్యమంత్రిని కాబట్టి, హైదరాబాద్ రావడం, మళ్లీ తిరిగి అమరావతికి రావడం, ప్రోటోకాల్ వ్యవహారాలు, భద్రతా సంబంధిత చర్యలు.. ఇలాంటి వాటి వల్ల ఎక్కువ ఖర్చు అవుతుందని, అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మీద మరింత భారం మోపకుండా ఉండేందుకు తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నట్టు తెలిసింది.

Three corporations,Mala Corporation,Madiga corporation,Relli corporation,ap caste based corporations,ఏపీలో మూడు కార్పొరేషన్లు,ఏపీలో కాపు కార్పొరేషన్,మాల కార్పొరేషన్,మాదిగ కార్పొరేషన్,రెల్లి కార్పొరేషన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి


సీఎం జగన్ విచారణకు హాజరుకాకపోవడానికి ఆయన చెప్పినవి... ఆర్థిక కారణాలు. అయితే, ఒకవేళ టీడీపీ ముందుకొచ్చి.. జగన్ ప్రయాణఖర్చులన్నీ తాము పెట్టుకుంటామని, సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రతి వారం ఇస్తామని ముందుకొస్తే అప్పుడు జగన్ హాజరవుతారా అనే ప్రశ్న కూడా కొందరు రాజకీయ పరిశీలకులు సంధిస్తున్నారు. మరోవైపు ఆర్థికంగా భారమని చెప్పే జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎన్నోసార్లు హైదరాబాద్ వెళ్లారని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా జగన్ పర్యటిస్తున్నారని, వాటికి కూడా ఖర్చవుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ హైదరాబాద్ వెళితే అదనంగా ఖర్చయేది కేవలం రాను, పోను చార్జీలు, భద్రతా సిబ్బంది టీఏ,డీఏలు మాత్రమేననే వాదనను కూడా మరికొందరు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రోటోకాల్ రద్దు చేసుకుని కూడా వెళ్లొచ్చని చెబుతున్నారు. అయినా, తెలంగాణలో జగన్ పర్యటిస్తే అక్కడి ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పిస్తుందనే వాదనను వారు తెరపైకి తెచ్చారు. వీటన్నిటి కంటే ముఖ్యంగా తాము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తామని కోర్టు చెబితే జగన్ ఏం చేస్తారనే ప్రశ్ననుకొందరు సంధిస్తున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు (లేదా అధికారులు) చేసినపని మీద వైసీపీ అభిమానులు మండిపడుతున్నారు.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...