40 రోజుల్లో అన్నీ నిండాలి... అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

news18-telugu
Updated: October 28, 2019, 3:05 PM IST
40 రోజుల్లో అన్నీ నిండాలి... అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
రాష్ట్రంలో ఇంత వరద వచ్చినా ఇప్పటికీ కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నింపకపోవడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. కాల్వల సామర్థ్యం, పెండింగులో ఉన్న పనులపై అధికారుల నుంచి సమాచారం కోరారు. వరదజలాలు వచ్చే 40 రోజుల్లో అన్ని ప్రాజెక్టులు నిండేలా కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రతిపాదనలతో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జలవనరులశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో ఉన్న రిజర్వాయర్ల నీటిమట్టాలు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులు సీఎంకు వివరించారు.

ప్రాంతాలు, ప్రాజెక్టులు, జిల్లాల వారీగా జరుగుతున్న పనులనుపై సీఎంకు అధికారులు నివేదిక అందించారు. ఇప్పటికే పనులు జరుగుతున్న పోలవరం, వెలిగొండ, వంశధార సహా, కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపైనా అధికారులతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం నడుస్తున్న, తప్పకుండా కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి ఆమేరకు అంచనాలను ఈ నివేదిక ద్వారా ఇవ్వాలని సూచించారు.

నిధుల వినియోగంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతల పరంగా నిధులను ఖర్చు చేయాలని అన్నారు. చేసిన ఖర్చుకు ఫలితాలు వచ్చేలా ఉండాలని స్పష్టం చేశారు. భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల కారణంగా చాలావరకు జలయజ్ఞం పనులు పెండింగులో ఉండిపోతున్నాయని అన్నారు. ఈ అంశంలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
Published by: Kishore Akkaladevi
First published: October 28, 2019, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading