బెల్ట్ షాపుల బంద్‌పై అసలు కారణం చెప్పిన సీఎం జగన్..

AP CM YS Jagan : ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే బెల్ట్ షాపుల మూసివేతకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగాన్ని పటిష్ఠం చేసి రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాపు కూడా ఉండకుండా చర్యలు తీసుకున్నారు. అయితే, బెల్ట్ షాపుల మూసివేత వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారాయన.

news18-telugu
Updated: March 6, 2020, 12:20 PM IST
బెల్ట్ షాపుల బంద్‌పై అసలు కారణం చెప్పిన సీఎం జగన్..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
  • Share this:
ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే బెల్ట్ షాపుల మూసివేతకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగాన్ని పటిష్ఠం చేసి రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాపు కూడా ఉండకుండా చర్యలు తీసుకున్నారు. అయితే, బెల్ట్ షాపుల మూసివేత వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారాయన. గొప్ప సంకల్పంతోనే ఈ చర్యకు పూనుకున్నట్లు వెల్లడించారు. గురువారం నాడు సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, బెల్ట్ షాపుల రద్దు, మద్యం అక్రమ తయారీపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బెల్ట్ షాపుల రద్దు వెనకున్న అసలు కారణాన్ని బయటపెట్టారు. రాష్ట్ర ప్రగతికి గ్రామాలు వెన్నెముక అని.. వాటిని అభివృద్ధి దిశగా కొనసాగిస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. గ్రామాభివృద్ధికి గ్రామ సచివాలయం, వైఎస్‌ఆర్ రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లు, ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన చేపడుతున్న తరుణంలో బెల్ట్ షాపులతో అభివృద్ధి కుంటుపడుతుందని.. అందుకే వాటిని మూసివేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.

అటు.. గ్రామాల్లో బెల్ట్ షాపులు నడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మహిళా పోలీసులదేనని, గ్రామాల్లో వున్న మహిళా మిత్రల సహాయం కూడా తీసుకొని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌‌మెంట్‌ విభాగంలో సిబ్బందిని పెంచాలని, ఎక్సైజ్‌ శాఖలో ఉన్న మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పనుల కోసం వినియోగించుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మద్యం అక్రమ తయారీ, ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుల్లో అక్రమ ఇసుక రవాణా, మద్యం రవాణాలపై నిఘా పెట్టి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 6, 2020, 12:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading