ముస్లీంలకు జగన్ రంజాన్ కానుక... రూ.5కోట్లు విడుదల

మసీదులు, ఈద్గాల్లో మరమ్మతులు, రంగులు వేయడం కోసం ప్రభుత్వం తరపున రూ.5 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.

news18-telugu
Updated: June 1, 2019, 2:56 PM IST
ముస్లీంలకు జగన్ రంజాన్ కానుక... రూ.5కోట్లు విడుదల
మద్యం నియంత్రణ పాలసీ
  • Share this:
ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్... శరవేగంగా పాలనలో దూసుకుపోతున్నారు. తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు సాగిపోతున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మూడురోజుల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్. తాజాగా రంజాన్ పండగ నేపథ్యంలో ముస్లీం సోదరులకు శుభవార్త అందించారు కొత్త సీఎం. రంజాన్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. మసీదులు, ఈద్గాల్లో మరమ్మతులు, రంగులు వేయడం కోసం ప్రభుత్వం తరపున రూ.5 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.

ఈరోజు ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీకి వస్తున్న ఆదాయం, ఖర్చులు, పెండింగ్ బిల్లులు సహా పలు అంశాలపై జగన్ ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 3న గుంటూరులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలోనూ ఆయన కూడా పాల్గొంటారు. మరికాసేపట్లో రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఇస్తున్న ఇఫ్తార్ విందుకు జగన్ హాజరుకానున్నారు. తాడేపల్లిలో తన నివాసం నుంచి ఆయన హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. అయితే ఈసారి జగన్ హైదరాబాద్ పర్యటనకు ఓ ప్రత్యేకత ఉంది. ఏపీ సీఎం హోదాలో జగన్ తొలిసారిగా... శనివారం హైదరాబాద్ వస్తున్నారు.
First published: June 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading