జగన్ పెట్టుబడుల వేట.. ఆగస్ట్ 9న రాష్ట్రంలో కీలక సదస్సు

ఆగస్ట్ 9న విజయవాడలో భారీ పెట్టుబడుల సదస్సును నిర్వహించబోతున్నారు.

news18-telugu
Updated: July 27, 2019, 10:24 PM IST
జగన్ పెట్టుబడుల వేట.. ఆగస్ట్ 9న రాష్ట్రంలో కీలక సదస్సు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి(File)
  • Share this:
పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇన్నాళ్లూ మేనిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు పెట్టుబడుల మీద దృష్టి కేంద్రీకరించారు. ఆగస్ట్  9న విజయవాడలో ఓ భారీ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సులో సుమారు 30 నుంచి 40 దేశాల రాయబారులు, కాన్సులేట్‌ జనరళ్లు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. వారితో సీఎం జగన్ ముఖాముఖి సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను వివరిస్తారు. శాంతి భద్రతలు, ప్రభుత్వ విధానాలు, పారదర్శక పాలన, అవినీతి రహిత, నిజాయితీతో కూడిన వ్యవస్ధలు, నైపుణ్యం ఉన్న మానవవనరులు, చౌకగా నాణ్యతతో కూడిన విద్యుత్‌ అవసరం. వాటిలో ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు పారిశ్రామిక రంగానికి ఏవిధంగా ఉపయోగపడునున్నాయో ముఖ్యమంత్రి ఈ సదస్సులో వివరిస్తారు.

ఆగస్ట్ 8న కియా నుంచి కొత్త కారు, సీఎంకు ఆహ్వానం
దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ తన కొత్త కారును ఆగస్ట్ 8న విడుదల చేయనుంది. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో తన కొత్తకారును మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కియా కంపెనీ కోరింది.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>