విజయవాడ వేదికగా.. విశాఖపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

విశాఖకు రాజధానిని ఎందుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామనే దానిపై సీఎం జగన్ వివరణ ఇచ్చారు. విజయవాడలో 'ది హిందూ ఎక్సెలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్' కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణపై స్పందించారు.

news18-telugu
Updated: February 5, 2020, 12:23 PM IST
విజయవాడ వేదికగా.. విశాఖపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
cm jagan (File Photo)
  • Share this:
విశాఖకు రాజధానిని ఎందుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామనే దానిపై సీఎం జగన్ వివరణ ఇచ్చారు. విజయవాడలో 'ది హిందూ ఎక్సెలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్' కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణపై స్పందించారు. ముందుగా ఏపీలో విద్యా ప్రక్షాళనపై స్పందించిన జగన్, విశాఖపైనా మాట్లాడారు. ముందుగా విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం సంపాదించాలని అన్నారు. విద్యలో దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉందని, అందుకే విద్యా రంగాన్ని మెరుగుపరచడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అందులో భాగంగానే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని అన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల రూపురేఖల్ని మారుస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియం ఎందుకు బోధించట్లేదని ప్రశ్నించిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తుంటే అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీని తట్టుకోవాల్సిన అవసరం ఉందని.. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం కనీస అవసరం అని సీఎం అన్నారు.

అటు.. పరిపాలన వికేంద్రీకరణపైనా సీఎం జగన్ స్పందించారు. విశాఖపట్నంలో మౌలిక వసతులన్నీ ఉన్నాయని, పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే అభివృద్ధి చేసుకోవచ్చని వెల్లడించారు. అభివృద్ధి ఒక్క చోటే కేంద్రీకృతం కావొద్దని ఆయన కుండబద్దలు కొట్టారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాభివృద్ధి కోసమే ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: February 5, 2020, 12:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading