జగన్ సరికొత్త నిర్ణయం... కేసీఆర్‌కు హ్యాండ్...

ఏపీ, తెలంగాణ కలిసి వృధాగా పోతున్న గోదావరి జలాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కేసీఆర్, జగన్‌తో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పలుసార్లు భేటీ కూడా అయ్యారు.

news18-telugu
Updated: October 29, 2019, 6:22 PM IST
జగన్ సరికొత్త నిర్ణయం... కేసీఆర్‌కు హ్యాండ్...
కేసీఆర్, వైఎస్ జగన్
  • Share this:
ప్రస్తుతం రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీకి అధికారికంగా మద్దతు ప్రకటించిన సీఎం కేసీఆర్... అక్కడ జగన్ విజయానికి కావాల్సిన నైతిక మద్దతు కూడా ఇచ్చారు. ఆ తరువాత సీఎం జగన్‌తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటివరకు ఈ ఇద్దరి విభేదాలు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఓ నిర్ణయం... ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలకు ఊతమిస్తోంది.

ఏపీ, తెలంగాణ కలిసి వృధాగా పోతున్న గోదావరి జలాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కేసీఆర్, జగన్‌తో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పలుసార్లు భేటీ కూడా అయ్యారు. తెలంగాణ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి గోదావరి నీటిని తరలించేందుకు పలు ప్రతిపాదనలను కేసీఆర్,జగన్ పరిశీలించారు. ఇందుకోసం ఖర్చు భారీగా ఉన్నా... ఏదో ఒక ప్రతిపాదనకు కేసీఆర్, జగన్ ఓకే చెబుతారనే ప్రచారం కూడా జరిగింది.

అయితే ఉన్నట్టుండి ఈ విషయంలో సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణతో సంబంధం లేకుండా కేవలం ఏపీ భూభాగం నుంచే గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని తరలించే రెండు ప్రతిపాదనలపై అధ్యయనం చేయాలని వ్యాప్కోస్ సంస్థను ప్రభుత్వం కోరడం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంలో కేసీఆర్‌కు హ్యాండిచ్చి సీఎం జగన్ సొంతంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో కేసీఆర్‌కు ఆయనకు మధ్య ఉన్న సత్సంబంధాలు దెబ్బతిన్నాయని అనుకోలేకపోయినా... ఏపీ సీఎం జగన్ తీసుకున్న సరికొత్త నిర్ణయంతో ఆయన కేసీఆర్‌కు కాస్త దూరం జరిగారనే చర్చ సాగుతోంది.
First published: October 29, 2019, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading