Home /News /politics /

AP CM YS JAGAN MOHAN REDDY NAMED MID DAY MEAL SCHEME AS YSR AKSHAYAPATRA AK

ఏపీలో మరో పథకానికి వైఎస్ఆర్ పేరు... సీఎం జగన్ నిర్ణయం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటోలు)

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటోలు)

ఏపీలో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకాన్ని వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్‌గా మార్చిన సీఎం వైఎస్ జగన్... తాజాగా మరో పథకానికి కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారు.

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకాన్ని వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్‌గా మార్చిన సీఎం వైఎస్ జగన్... తాజాగా మరో పథకానికి కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఏపీలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... ఆ పథకానికి వైఎస్‌ఆర్ అక్షయపాత్రగా నామకరణం చేశారు. ఇందులో పని చేస్తున్న వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు.. మొగ్గుచూపేలా పాఠశాలల్ని తీర్చిదిద్దాలని తెలిపారు.

    స్కూళ్లలో మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దని అన్నారు. సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలని సూచించారు. ఇది ప్రాథమిక సమావేశం కావడంతో... తర్వాత సమావేశం నాటికి పూర్తిస్థాయి ప్రణాళికలతో రావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.




    First published:

    Tags: Chandrababu naidu, NTR, Tdp, Ys jagan mohan reddy, YSR, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు