సీఎం జగన్ స్కెచ్.. టీడీపీ అష్టదిగ్బంధం

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్లానింగ్‌తో ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీని అష్టదిగ్బంధం చేస్తున్నారు.

news18-telugu
Updated: October 13, 2019, 4:28 PM IST
సీఎం జగన్ స్కెచ్.. టీడీపీ అష్టదిగ్బంధం
సీఎం జగన్, చంద్రబాబునాయుడు
news18-telugu
Updated: October 13, 2019, 4:28 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్లానింగ్‌తో ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీని అష్టదిగ్బంధం చేస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఆయన పరిపాలనను గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం అయిన మూడు నెలల కాలంలో జగన్ మోహన్ రెడ్డి పెద్దగా బయటకు రాలేదు. పాలన మీద పట్టు పెంచుకోవడానికి, అధికారులతో సమావేశాలు, సమీక్షలతో బిజీగా గడిపారు. అయితే, అక్టోబర్ నుంచి ఆయన వ్యూహం మార్చారు. వరుసగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ మళ్లీ బలపడొచ్చని అనుమానం ఉన్న చోట ఆయన తన పథకాలను ప్రారంభిస్తున్నారు. ఓ పథకాన్ని తూర్పుగోదావరిలో ప్రారంభిస్తే, మరో దాన్ని పశ్చిమలో ప్రారంభిస్తున్నారు. ఇంకో పథకాన్ని రాయలసీమ నుంచి ప్రారంభించారు. త్వరలో మరో స్కీమ్‌ను సింహపురి నుంచి ప్రారంభించబోతున్నారు.

వైఎస్ఆర్ కంటివెలుగు పథకం ప్రారంభోత్సవంలో సీఎం జగన్ • జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో ప్రారంభించారు.

 • అక్టోబర్ 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు. సొంత ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేలు ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. • రెండు పథకాలను వరుసగా గోదావరి జిల్లాల్లో ప్రారంభించిన సీఎం.. మూడో పథకానికి రాయలసీమను ఎంచుకున్నారు. వైఎస్ఆర్ కంటివెలుగు పథకాన్ని అనంతపురంలో ప్రారంభించారు. రాష్ట్రంలో అంథత్వాన్ని నిరోధించడం కోసం ప్రజలకు కంటి వైద్య పరీక్షలను నిర్వహించి.. వారికి ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం.

 • జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల్లో అత్యంత ముఖ్యమైన వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ఈనెల 15న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
  Loading...
  విశాఖ పర్యటనలో చంద్రబాబునాయుడు


  అంతకు ముందు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను కృష్ణా జిల్లా విజయవాడలో ప్రారంభించారు. గ్రామ వాలంటీర్లకు ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేశారు. ఇలా ఒక్కో పథకాన్ని ఒక్కో జిల్లాలో ప్రారంభిస్తూ.. అన్ని జిల్లాల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు, టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ఓ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇలా అనుకున్న ప్రకారం.. ఆయా జిల్లాల్లో ప్రభుత్వం మీద సానుకూల దృక్పథాన్ని తీసుకొచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

  ఆర్టీసీ కార్మికుడిపై సీఐ పిడిగుద్దులు

 •  


First published: October 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...