హోమ్ /వార్తలు /politics /

CM Jagan Meets Governor: గవర్నర్ తో సీఎం జగన్ భేటీ.. తాజా పరిణామాలపై చర్చ..

CM Jagan Meets Governor: గవర్నర్ తో సీఎం జగన్ భేటీ.. తాజా పరిణామాలపై చర్చ..

గవర్నర్ తో భేటీ అయిన ఏపీ సీఎం జగన్

గవర్నర్ తో భేటీ అయిన ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy).. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP Governor Biswabhushan Harichandan) తో భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy).. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP Governor Biswabhushan Harichandan) తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతి (YS Jagan wife YS Bharathi) తో సహా రాజ్ భవన్ కు వెళ్లిన జగన్.. 40 నిముషాల పాటు గవర్నర్ తో వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై (Attack on TDP Office) జరిగిన దాడి ఘటనతో పాటు దానికి దారితీసిన పరిస్థితులు.. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. అలాగే శాసనసభ సమావేశాలపై గవర్నర్ తో సీఎం చర్చించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఢిల్లీలోనూ వైసీపీ-టీడీపీ నేతల మధ్య వార్ కొనసాగుతోంది. గురువారం ఇరుపార్టీల ఎంపీలు హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడేందుకు పోటీపడ్డారు. అటు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఇటు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్ స్థాయి సంఘం సమావేశం ముగిసిన అనంతరం షాతో మాట్లాడారు. ఏపీలో పరిస్థితులను రవీంద్రకుమార్ వివరించగా.. మాధవ్ మాత్రం ఓ లేఖను ఆయనకు అందించారు.

ఇది చదవండి: ఏపీ మంత్రి నోట సమైక్యాంధ్ర మాట... కేసీఆర్ ఆలా చేస్తే బెటరని సలహా..


మరోవైపు తెలుగుదేశం పార్టీ గుర్తంపును రద్దుచేయాలంటూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ ఒక ఉగ్రవాద పార్టీ అని ఆయన తీవ్రవ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్, దేవినేని ఉమా, , బోండా ఉమ, అయ్యన్నపాత్రుడు, పట్టాభి తదితరులు చేసిన వ్యాఖ్యలను ఎలక్షన్ కమిషన్ సభ్యులు ఇద్దరికీ వివరించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. సీఎం స్థాయి వ్యక్తిని దూషిస్తూ రాష్ట్రంలో అశాంతికి కారణమవుతున్న టీడీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ సీఈసీకి లేఖ ఇచ్చారు.

ఇది చదవండి: వైఎస్ జగన్ నా శ్రేయోభిలాషి.. అందుకే వచ్చా..! సీఎంతో భేటీపై నాగార్జున క్లారిటీ..


ఒక టెర్రరిస్టు అవుట్ ఫిట్ లాంటి పొలిటికల్ పార్టీని.. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తే.. తద్వారా దొంగలు, టెర్రరిస్టులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే దేశం పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని విజయసాయి రెడ్డి అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో స్థానిక సంస్థల నుంచి 11 స్థానాలు.. ఎమ్మెల్యేలు ఎన్నుకునే 3 స్థానాలను భర్తీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Governor

ఉత్తమ కథలు