సీఎం జగన్‌కు అమిత్ షా క్లారిటీ ఇస్తారా ?

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ సందర్భంగా ఆయన హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: August 26, 2019, 12:34 PM IST
సీఎం జగన్‌కు అమిత్ షా క్లారిటీ ఇస్తారా ?
అమిత్ షా, జగన్
  • Share this:
కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న కేంద్ర హోంశాఖ సమావేశానికి హాజరయ్యేందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశం అనంతరం సీఎం జగన్ హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితులపై ఆయన కేంద్రానికి వివరణ ఇస్తారని సమాచారం. పోలవరం రివర్స్ టెండరింగ్‌కు ఏపీ హైకోర్టు బ్రేక్ వేయడం, రాజధాని అమరావతిపై మొదలైన ఊహాగానాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై సీఎం జగన్ అమిత్ షాకు వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా ఉన్న కేంద్రం... దీనిపై జగన్‌ను వివరణ కోరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

రాష్ట్రంలో తాము తీసుకుంటున్న నిర్ణయాలన్నింటికీ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అశీస్సులు ఉన్నాయని కొద్దిరోజుల క్రితం వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం విజయసాయిరెడ్డిని పిలిపించుకుని వివరణ కోరినట్టు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ను సైతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో వివరణ కోరే అవకాశం లేకపోలేదని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఢిల్లీ పర్యటన తరువాత సీఎం జగన్ రాష్ట్రానికి వచ్చి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దాన్నిబట్టి... కేంద్రం ఆయనకు ఎలాంటి సూచనలు చేసిందనే విషయంలో స్పష్టత వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>