నిధుల కోసం జగన్ ఏం చేస్తారు... తండ్రి వైఎస్ఆర్ మార్గాన్ని అనుసరిస్తారా ?

కేంద్రం నుంచి ఆర్థికం సాయం అందుతుందనే ఆశలు పెద్దగా కనిపించకపోవడంతో... సీఎం జగన్ ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిందే అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ వైపు పొదుపు మంత్రం పాటిస్తూనే మరోవైపు నిధులను సమకూర్చుకోవడంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి పెట్టాల్సి ఉంది.

news18-telugu
Updated: June 1, 2019, 11:11 AM IST
నిధుల కోసం జగన్ ఏం చేస్తారు... తండ్రి వైఎస్ఆర్ మార్గాన్ని అనుసరిస్తారా ?
వైఎస్ జగన్
news18-telugu
Updated: June 1, 2019, 11:11 AM IST
ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి ఏ రకంగా గట్టెక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. కేంద్రం నుంచి ఆర్థికం సాయం అందుతుందనే ఆశలు పెద్దగా కనిపించకపోవడంతో... సీఎం జగన్ ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిందే అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ వైపు పొదుపు మంత్రం పాటిస్తూనే మరోవైపు నిధులను సమకూర్చుకోవడంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ఏపీలో కొత్తగా ఎక్కడి నుంచి ఖజానాకు నిధులు రాబట్టవచ్చనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.

గనులు, ఇసుక రీచ్‌లను వేలం వేయడంతో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా ప్రభుత్వం నిధులను సమకూర్చుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రాజధాని కోసం గత ప్రభుత్వం సేకరించిన వేల ఎకరాల భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వాటిలో కొంత మేర కొత్త ప్రభుత్వం వేలం ద్వారా విక్రయిస్తుందా అనే చర్చ కూడా మొదలైంది. అయితే ప్రభుత్వం రైతులకు ఇష్టం లేకున్నా భూములు లాక్కుందని గతంలో చంద్రబాబుపై వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఆ భూములను విక్రయిస్తుందా అన్నది సందేహమే.

మరోవైపు రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు ఎక్కువగానే ఉన్నాయి. 2004లో జగన్ తండ్రి, నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయంలోనూ ఏపీలో నిధుల కొరత తీవ్రంగా ఉంది. దీన్ని అధిగమించే క్రమంలో కొంత మేర ప్రభుత్వ భూములను వేలం ద్వారా అమ్మేసింది అప్పటి ప్రభుత్వం. అయితే అప్పట్లో ఎక్కువగా రాజధాని అయిన హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములనే ప్రభుత్వం విక్రయించింది. ఆ రకంగా ఖజానాకు కొంతమేర నిధులు సమకూరాయి. జగన్ కూడా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో పయనిస్తారా అన్నది చూడాలి.First published: June 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...