హోమ్ /వార్తలు /రాజకీయం /

ఏపీ కేబినెట్‌‌కు ముహూర్తం ఫిక్స్.. ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీ కేబినెట్‌‌కు ముహూర్తం ఫిక్స్.. ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,

YS Jagan: కేబినెట్‌లో తొలుత 15 మందికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని దక్కించుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 8న కేబినెట్ మంత్రుల వివరాలను ప్రకటించనున్నారు. కేబినెట్‌లో తొలుత 15 మందికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నిన్న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అవ్వాతాతల పింఛను పెంపుపై తొలి సంతకాన్ని పెట్టిన ఆయన.. రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానని ప్రకటించారు. ఇదిలా ఉండగా, జూన్ 11 తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

First published:

Tags: AP cabinet, AP DGP, Gautam Sawang, Ys jagan mohan reddy

ఉత్తమ కథలు