అమరావతిపై కీలక ప్రకటన చేయనున్న సీఎం జగన్.. ముహూర్తం ఫిక్స్...?

రాజధాని పరిధిలోని 29 గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగిస్తారా? లేకపోతే అన్నింటినీ కలిపి నగరపాలక సంస్థగా మారుస్తారా?

news18-telugu
Updated: December 1, 2019, 5:24 PM IST
అమరావతిపై కీలక ప్రకటన చేయనున్న సీఎం జగన్.. ముహూర్తం ఫిక్స్...?
వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వాసులు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగిస్తారా? లేకపోతే అన్నింటినీ కలిపి నగరపాలక సంస్థగా మారుస్తారా? అని రాజధాని రైతులు సందేహంలో ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. మరోవైపు జనవరిలో పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో రాజధాని గ్రామాల భవిష్యత్తుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రాజధానిపై కొంత స్తబ్ధత నెలకొంది. అయితే, తాజాగా సీఎం జగన్ సీఆర్డీఏ సమావేశంలో చేసిన ప్రకటన రాజధానిపై జగన్ ముందుకే వెళ్లాలని నిర్ణయించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.  పంచాయతీలకు వచ్చే నిధులు, మున్సిపాిలిటీలకు వచ్చే నిధులు వేర్వేరుగా ఉంటాయి. దీంతోపాటు రాజధానిలో భూముల విలువల్లో కూడా మార్పు వస్తుంది. ప్రభుత్వం లెక్కల ప్రకారమే భూమి విలువ పెరుగుతుంది. దీంతోపాటు ఇతర పన్నులు కూడా కట్టాల్సి ఉంటుంది. అయితే, మున్సిపాలిటీకి తగిన సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>