డ్వాక్రా మహిళలకు జగన్ గుడ్ న్యూస్.. ఒక కండిషన్

నాలుగు విడుతల్లో ఈ రుణమాఫీ చేయనున్నారు. కానీ, రుణం పొందిన మహిళలు తమ బకాయిని కడుతూ ఉండాలి. ఆ తర్వాత రోజుల్లో ప్రభఉత్వం నుంచి మాఫీ అయిన నగదు మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది.

news18-telugu
Updated: June 16, 2019, 2:31 PM IST
డ్వాక్రా మహిళలకు జగన్ గుడ్ న్యూస్.. ఒక కండిషన్
ఏపీ సీఎం జగన్ (File)
news18-telugu
Updated: June 16, 2019, 2:31 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్ఆర్ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.840 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయనున్నారు. నాలుగు విడుతల్లో ఈ రుణమాఫీ చేయనున్నారు. కానీ, రుణం పొందిన మహిళలు తమ బకాయిని కడుతూ ఉండాలి. ఆ తర్వాత రోజుల్లో ప్రభఉత్వం నుంచి మాఫీ అయిన నగదు మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. మండలాలు, పట్టణాల్లో సంబంధిత అధికారులు బ్యాంకుల ద్వారా అర్హులైనా లబ్ధిదారులను ముందుగా గుర్తిస్తారు. అలా గుర్తించిన వారిని ఏపీఎం లాగిన్‌ ద్వారా సెర్ఫ్‌కు సమాచారం అందిస్తారు. అనంతరం 2019, ఏప్రిల్‌ 11 నాటికి అప్పు తీసుకున్న డ్వాక్రా సభ్యులకు ఆ మొత్తాన్ని బ్యాంకులో జమచేస్తారు. నాలుగు విడతల్లో లబ్ధిదారులందరికీ రుణ మాఫీ అవుతుంది.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...