14న ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్..

15వ తేదీ నీతి అయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు.

news18-telugu
Updated: June 12, 2019, 10:51 PM IST
14న ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్..
నరేంద్రమోదీ, జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 14న ఢిల్లీ వెళ్తున్నారు. ఈనెల 15న నీతి అయోగ్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి హస్తిన వెళ్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది నీతి అయోగ్‌తో ముడిపడి ఉంది. గతంలో స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రానికి ఇవ్వొద్దని నీతి అయోగ్ చెప్పినందుకే తాము ఇవ్వలేకపోతున్నామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవస్యకతను తెలియజేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో ఓ నివేదిక సిద్ధం చేయించారు. ఆ రిపోర్టును నీతి అయోగ్ సమావేశం సందర్భంగా వారికి అందించనున్నట్టు తెలిసింది. హోదాతోపాటు, విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి జగన్ చర్చించనున్నారు. దీంతో పాటు ఈనెల 15న ఢిల్లీలో జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. వైసీపీ నుంచి 22 మంది లోక్‌సభ ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ వ్యూహంపై ఈ భేటీలో చర్చిస్తారు. ఈనెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
First published: June 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading