ఏపీ మంత్రి దూకుడు... వైసీపీలో రైజింగ్ స్టార్

కేవలం కృష్ణా జిల్లా మాత్రమే కాదు... తాను ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలోనూ కొడాలి నాని టీడీపీని టార్గెట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

news18-telugu
Updated: November 26, 2019, 6:07 PM IST
ఏపీ మంత్రి దూకుడు... వైసీపీలో రైజింగ్ స్టార్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాజకీయాలు ఎఫ్పుడు ఒకేలా ఉండవు. పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఉంటుందో చెప్పలేం. తాజాగా ఏపీ రాజకీయాల్లో ఓ మంత్రి కీలకంగా మారుతున్నారు. ఆయనే కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీలోకి తీసుకురావడంతో పాటు చంద్రబాబును, టీడీపీని విమర్శించడంలో కొడాలి నాని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాటలు కాస్త పరుషంగా ఉన్నాయనే ప్రచారం జరిగినా... టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించే విషయంలో కొడాలి నాని ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొడాలి నానికి కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీ నేతలెవరూ ముందుకు రావడం లేదనే టాక్ కూడా ఉంది.

టీడీపీని విమర్శించడం మాత్రమే కాదు... కృష్ణా జిల్లాలో టీడీపీని బలహీనపరిచే బాధ్యతలను కూడా సీఎం జగన్ కొడాలి నానికి అప్పగించారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. మంగళవారం దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ సీఎం జగన్‌ను కలిశారు. వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే... గన్నవరంలో మళ్లీ పార్టీని గెలిపించే బాధ్యతను కూడా జగన్ కొడాలి నానికి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Ap cm ys jagan, ap news, ap politics, kodali nani, Krishna district, vallabaneni vamsi, tdp, ysrcp, Srikakulam district, ఏపీ సీఎం జగన్, కొడాలి నాని, కృష్ణా జిల్లా, వల్లభనేని వంశీ, టీడీపీ, వైసీపీ, శ్రీకాకుళం జిల్లా
కొడాలి నాని (FIle)


కేవలం కృష్ణా జిల్లా మాత్రమే కాదు... తాను ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలోనూ కొడాలి నాని టీడీపీని టార్గెట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా పేరున్న అచ్చెన్నాయుడును ఢీకొట్టే బాధ్యతను కూడా సీఎం జగన్ కొడాలి నానికే అప్పగించారని తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో ప్రస్తుతం దూకుడు ప్రదర్శిస్తున్న మంత్రి కొడాలి నాని... సీఎం జగన్ మెచ్చిన మంత్రిగా మారారనే టాక్ వినిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: November 26, 2019, 6:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading