ఏపీలో కాపు రిజర్వేషన్లపై త్రిసభ్య కమిటీ

చంద్రబాబు కాపు రిజర్వేషన్ల ను రాజకీయ అంశం గానే చూసారని ఆరోపిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.

news18-telugu
Updated: July 29, 2019, 12:52 PM IST
ఏపీలో కాపు రిజర్వేషన్లపై త్రిసభ్య కమిటీ
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కాపు నేతల భేటీ ముగిసింది. కాపు రిజర్వేషన్ల వ్యవహరంపై త్రిసభ్య కమిటీ వేశారు. కమిటీలో సభ్యులుగా మంత్రి కన్నబాబు, ఉమ్మారెడ్డి, అంబటిని నియమించారు. కాపు రిజర్వేషన్లు.. కేంద్ర చట్టం.. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై త్రిసభ్య కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో తేదీన కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ కేంద్రం రాసిన లేఖ అంశాన్ని  సీఎం జగన్ ప్రస్తావించారు.

గతంలో కాపులను బీసీల్లో చేరుస్తామంటూ చేసిన తీర్మానం.. ఓబీసీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లిచ్చిన అంశాన్ని లేఖలో కేంద్రం ప్రస్తావించింది. కాపులను బీసీల్లో చేర్చాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా..? అంటూ లేఖలో కేంద్రం స్పష్టత కోరిందన్న అంశాన్ని నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ లేఖకు అప్పటి సీఎం చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు.

చంద్రబాబు కాపు రిజర్వేషన్ల ను రాజకీయ అంశం గానే చూసారని ఆరోపిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ పై కోర్టులు తేల్చాల్సి ఉందన్నారు బీజేపీ నేత సోము వీర్రాజు. EWS రిజర్వేషన్ల లో రాష్ట్రాలు కులాల వారీగా కేటాయింపు పై స్పష్టత రావాల్సి ఉందన్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు సోము. 10 శాతం రిజర్వేషన్ లలో రాష్ట్రాల నిర్ణయాలు తీసుకునే వేసులు బాటు లేదనే వాదన ఉందన్నారాయన.
Published by: Sulthana Begum Shaik
First published: July 29, 2019, 12:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading