వైసీపీ ఎమ్మెల్యేకు డబుల్ షాక్ ఇచ్చిన జగన్...

మంగళగిరి ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి... చంద్రబాబు కుమారుడు, మాజీమంత్రి నారా లోకేశ్‌ను ఓడించి సంచలనం సృష్టించారు.

news18-telugu
Updated: December 26, 2019, 2:19 PM IST
వైసీపీ ఎమ్మెల్యేకు డబుల్ షాక్ ఇచ్చిన జగన్...
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయంతో అమరావతి ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ ముఖ్యనేతలు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాజధాని తరలింపుపై ఆందోళనతో ఉన్న అమరావతి ప్రాంత రైతులు... తమ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు. మంగళగిరి, తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి సంగతి ఎలా ఉన్నా... జగన్ తీసుకున్న నిర్ణయం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి డబుల్ షాక్ ఇచ్చినట్టు అయ్యిందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

మంగళగిరి ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి... చంద్రబాబు కుమారుడు, మాజీమంత్రి నారా లోకేశ్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో ప్రచారానికి వచ్చిన వైఎస్ జగన్... ఆళ్ల రామకృష్ణారెడ్డికి గెలిపిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆళ్లను మంత్రివర్గంలోకి తీసుకోలేదు జగన్. ఇది ఒకరకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి షాక్ అనే చెప్పాలి.

alla rama krishna reddy, alla ramakrishna reddy, mla alla rama krishna reddy, mla alla ramakrishna reddy, mangalagiri ycp mla alla rama krishna reddy, ycp mla alla ramakrishna reddy, mangalagiri mla alla ramakrishna reddy, ycp mla alla rama krishna reddy, ysrcp mla alla rama krishna reddy, alla rama krishna reddy ticket issue, alla rama krishna reddy latest speech, ycp mla, jagan ycp, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ఆర్కే మంగళగిరి సీటు, మంగళగిరి సీట్, మంగళగిరి
జగన్, ఆళ్ల రామకృష్ణారెడ్డి (Image : Twitter)


మంత్రి కాకపోయినా...నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటే ఎమ్మెల్యే ఆర్కే... జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కారణంగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ఆయనకు భద్రతను కూడా పెంచారు. ఇలా జగన్ చెప్పినట్టు మంత్రి పదవి దక్కకపోగా... తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయం కారణంగా నియోజకవర్గంలో వైసీపీపై ఏర్పడిన వ్యతిరేకతను అధిగమించడం ఎమ్మెల్యే ఆళ్లకు పెద్ద సవాల్ అనే ప్రచారం జరుగుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: December 26, 2019, 2:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading