• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • AP CM YS JAGAN MOHAN REDDY DECIDED TO TERMINATE TTD AND OTHER TRUST OF MAJOR TEMPLES IN STATE AK

టీటీడీ సహా అన్ని పాలకమండళ్ల రద్దు... సీఎం జగన్ కీలక నిర్ణయం ?

తిరుమల ఆలయం

టీటీడీతో పాటు విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సహా పలు దేవాలయాల పాలకమండళ్లను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

  • Share this:
    టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల పాలకమండళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే దిశగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినా... టీడీపీ ప్రభుత్వం హయాంలో కొలువుదీరిన పాలకమండళ్లు అనేక దేవస్థానాల్లో కొనసాగుతున్నాయి. టీటీడీ పాలకమండలి చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ నిరాకరించారు. అవసరమైతే ప్రభుత్వం పాలకమండలిని రద్దు చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీటీడీతో పాటు విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సహా పలు దేవాలయాల పాలకమండళ్లను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈ నెల 8న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్... అదే రోజు కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇందుకు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తితే... అసెంబ్లీలో ఇందుకు సంబంధించి బిల్లు పెట్టి ఆమోదింపజేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. మొత్తానికి ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన తరువాత సాధ్యమైనంత తొందరగానే ప్రధాన ఆలయాల పాలకమండళ్లు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.




    First published: