చంద్రబాబు, జగన్ సన్నిహితుల చర్చలు... అంతా సస్పెన్స్

పార్లమెంట్ గ్యాలరీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ గంటకు పైగా మాట్లాడుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: June 18, 2019, 1:02 PM IST
చంద్రబాబు, జగన్ సన్నిహితుల చర్చలు... అంతా సస్పెన్స్
టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 18, 2019, 1:02 PM IST
ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య పలకరింపులు చాలా ముక్తసరిగా ఉంటున్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదో మాటవరసకు మాట్లాడుకోవడం... కెమెరాల ముందుకు పలకరించుకోవడం తప్పితే ఇరు పార్టీల నేతలెవరూ పెద్దగా కలిసి మాట్లాడుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. అలా మాట్లాడుకుంటే అది సంచలనమే అవుతుంది. తాజాగా అలాంటి సంచలనం ఒకటి చోటు చేసుకుంది. అది కూడా ఢిల్లీలో. పార్లమెంట్‌లో లోక్ సభ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా గ్యాలరీలో కూర్చున్న టీడీపీ రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేశ్, ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డితో గంటకు పైగా ముచ్చటించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మొదట సీఎం రమేశ్‌ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉండగా, విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకొని కొద్దిసేపు ఎవరి సీట్లలో వారే కూర్చుండి పోయారు. తర్వాత విజయసాయిరెడ్డి ముందు వరుసకు వచ్చి సీఎం రమేశ్‌ పక్కన కూర్చొన్నారు. దాదాపు గంటన్నరకుపైగా వారిద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు.

కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వచ్చినా ఆయన వారిద్దరికీ కొంత దూరంలో కూర్చుండిపోయారు. ఆ తర్వాత కూడా సీఎం రమేశ్‌, విజయసాయిరెడ్డిలు చర్చల్లో మునిగిపోయారు. సమావేశానంతరం ఈ చర్చల సారాంశం గురించి విజయసాయిరెడ్డిని విలేకర్లు అడిగారు. మీ హయాంలో ఏమేం చేశారో చెప్పమని రమేశ్‌ను అడిగాను అంటూ విజయసాయిరెడ్డి బదులిచ్చారు. మొత్తానికి టీడీపీని, ఆ పార్టీ ముఖ్యనేతలను ట్విట్టర్ వేదికగా టార్గెట్ చేస్తున్న విజయసాయిరెడ్డి... ఎంపీ సీఎం రమేశ్ సీటు వద్దకు వెళ్లి ఏం చర్చించారన్నది వారిద్దరికే తెలియాలి.First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...