సాక్షిలో వచ్చింది తప్పు... సభలో సీఎం జగన్

వైసీపీ మేనిఫెస్టోలో సన్న బియ్యం అన్న మాటే లేదని సీఎం జగన్ అన్నారు. మేనిఫెస్టోలో చెప్పని పనులను కూడా ప్రభుత్వం చేస్తోందని సిఎం గుర్తు చేశారు.

news18-telugu
Updated: December 10, 2019, 12:30 PM IST
సాక్షిలో వచ్చింది తప్పు... సభలో సీఎం జగన్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
సన్నబియ్యంపై చర్చ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సాక్షిలో సన్నబియ్యం అని రాశారని ఏపీ అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. దీనిపై స్పందించిన ఏపీ సీఎం జగన్... ఈ విషయంపై సాక్షిలో తప్పు వచ్చిందని... వాళ్లు కూడా మీలాగే పొరపాటు పడ్డారని టీడీపీ ఎమ్మెల్యేను ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన బియ్యానికి సన్న బియ్యానికి తేడా తెలియక వాళ్లు తికమకపడ్డారని అన్నారు. కావాలంటే ఆ రోజు మిగతా పేపర్లు చూడాలని... చాలామంది కరెక్ట్‌గా రాశారని సీఎం జగన్ అన్నారు. అది చూస్తే మీకు కూడా నాలెడ్జ్ పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

వైసీపీ మేనిఫెస్టోలో సన్న బియ్యం అన్న మాటే లేదని సీఎం జగన్ అన్నారు. మేనిఫెస్టోలో చెప్పని పనులను కూడా ప్రభుత్వం చేస్తోందని సిఎం గుర్తు చేశారు. తొలుత బియ్యం గురించి నాలెడ్జ్‌ పెంచుకోవాలని టిడిపి సభ్యులకు సూచించారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించామని.. నాణ్యమైన బియ్యం ప్రజలకు అందజేస్తున్నామన్నారు. ప్రజలు బియ్యాన్ని అమ్ముకోకుండా.. తినాలనే ఆలోచన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉందన్నారు. ఇదే విధంగా ఏప్రిల్‌ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు.
Published by: Kishore Akkaladevi
First published: December 10, 2019, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading