పులివెందుల ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ గిఫ్ట్...

తన సొంత జిల్లా కడపలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి 25 వరకు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

news18-telugu
Updated: December 22, 2019, 3:55 PM IST
పులివెందుల ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ గిఫ్ట్...
వైఎస్ జగన్
  • Share this:
తన సొంత జిల్లా కడపలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి 25 వరకు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. 23న కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు పునాదిరాయి వేయనున్నారు. ఈనెల 25న క్రిస్మస్ రోజు తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్మించిన ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవం చేయనున్నారు. 23 నుంచి 25 వరకు మూడు రోజుల్లో పులివెందుల, జమ్ములమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేయనున్నారు.

23.12.2019 (సోమవారం)

ఉదయం 9.20 – కడపలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి ప్రారంభం
– 9.55 గంటలకు – రిమ్స్‌లో వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపన
– 10.30 గంటలకు– వైఎస్సార్‌ ఉచిత భోజన వసతి భవనం ప్రారంభం
– 11.50 – జమ్ములమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌కు సీఎం శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభ

– మధ్యాహ్నం 2.15 గంటలకు – దువ్వూరు మండలం నేలటూరు వద్ద మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు– సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయ చేరిక

24.12.2019 (మంగళవారం)

– ఉదయం 9.05 గంటలకు – ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌కు చేరిక
– 9.10 – దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళి
– 2.00 – రాయచోటి సభాస్ధలికి ముఖ్యమంత్రి చేరుకుంటారు
– 2.15 – వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభ
– 5.00 – పులివెందుల భాకరాపురంలోని నివాసానికి చేరుకోనున్న సీఎం

25.12.2019 (బుధవారం)

– ఉదయం 9.20 – క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు
– 11.15 – పులివెందుల జూనియర్‌ కళాశాల మైదానంలో పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన, వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం
– 3.00 – కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి గన్నవరం బయలుదేరుతారు
Published by: Ashok Kumar Bonepalli
First published: December 22, 2019, 3:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading