ఆ మీడియా సంస్థకు సీఎం జగన్ షాక్

చంద్రబాబు హయాంలో విశాఖలో ఆంధ్రజ్యోతికి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.

news18-telugu
Updated: October 16, 2019, 4:36 PM IST
ఆ మీడియా సంస్థకు సీఎం జగన్ షాక్
సీఎం వైఎస్ జగన్
news18-telugu
Updated: October 16, 2019, 4:36 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రజ్యోతి మీడియాకు షాక్ ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విశాఖలోని పరదేశీపాలెంలో ఆమోదా పబ్లికేషన్ సంస్థకు ఎకరంన్నర భూమిని కేటాయించింది. ఈ కేటాయింపును తప్పుబట్టిన ఏపీ మంత్రివర్గం... భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. సుమారు రూ. 40 కోట్ల విలువైన భూమిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం అప్పటి ప్రభుత్వం తమకు అనుకూలమైన వారికి రూ.50.5 లక్షలకు కేటాయించారని మంత్రి పేర్ని నాని అన్నారు. దానిని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. గత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్దిష్ట కార్యకలాపాలు సాగడం లేదని, అందువల్ల ఆ భూమి కేటాయింపును రద్దు చేశామని ఆయన తెలిపారు.రాజకీయంగా శత్రువులపై విష ప్రచారానికి పాల్పడడానికే గత ప్రభుత్వం ఆ భూమి కేటాయింపు చేసిందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఆ భూమి కేటాయింపును రద్దు చేసి బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని కూడా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.


First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...