అక్షరాలు దిద్దించిన వైఎస్ జగన్.. చిన్నారులతో ఆడుతూ పాడుతూ సీఎం

ఈ కార్యక్రమానికి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేటట్లు విశ్వాసాన్ని కలిగించటానికి ‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ అనే నినాదంతో రాజన్నబాట నిర్వహిస్తోంది ఏపీ సర్కార్ .

news18-telugu
Updated: June 14, 2019, 11:27 AM IST
అక్షరాలు దిద్దించిన వైఎస్ జగన్.. చిన్నారులతో ఆడుతూ పాడుతూ సీఎం
రాజన్న బడిబాట కార్యక్రమంలో వైఎస్ జగన్
  • Share this:
ఏపీలో రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విద్యార్థుల సామూహిక అక్షరాభ్యాసంలో ఆయన పాల్గొన్నారు. శుక్రవారం తాడేపల్లి మండలం పెనమాకలోని వందేమాతరం హైసూల్క్‌లో విద్యార్థులకు జరిగే సామూహిక అక్షరాభాస్య కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. చిన్నారుల్ని తన ఒడిలో కూర్చొబెట్టుకొని పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దించారు. ఈ కార్యక్రమానికి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేటట్లు విశ్వాసాన్ని కలిగించటానికి ‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ అనే నినాదంతో రాజన్నబాట నిర్వహిస్తోంది ఏపీ సర్కార్ . అయితే ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుంబిగించారు. పిల్లలు పలక, బలపం పట్టినప్పటి నుంచి తమ ఆకాంక్షలను వారికి రెక్కలుగా కడతారు తల్లిదండ్రులు. బిడ్డల భవిష్యత్‌పై ఎన్నో కలలు కంటారు. ఆ కలల నిజం చేసే క్రమంలో కార్పొరేట్‌ చదువులే తమ పిల్లలకు మంచి మార్గమని భ్రమ పడుతున్నారు. దీనికి సర్కారు బడుల్లో వసతులలేమి కూడా కారణంగా చెబుతున్నారు. దీంతో సర్కార్ స్కూళ్లను అభివృద్ది చేసేందుకు సంకల్పించారు వైఎస్ జగన్. ప్రధానంగా రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఏడాది స్కూల్‌ ప్రారంభించేనాటికే విద్యార్థులకు సంబంధించి 19.85 లక్షల పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, 2,51,601 మంది బూట్లు, రెండు జతల సాక్సులు అందిస్తున్నారు. 8, 9 తరగతులు చదివే బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు పదోతరగతిలో ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను స‌త్క‌రించాల‌ని, ఆయా కార్య‌క్ర‌మాల‌న్నింటిలోనూ పూర్వ విద్యార్థుల‌ను భాగస్వామ్యుల‌ను చేయాల‌ని విద్యాశాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు