‘జగన్ అనే నేను హామీ ఇస్తున్నాను..’ కడప జిల్లాలో డిసెంబర్ 26న..

Kadapa Steel Plant | ‘జగన్ అనే నేను.. డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తాను.’ అని జగన్ ప్రకటించారు.

news18-telugu
Updated: July 8, 2019, 3:44 PM IST
‘జగన్ అనే నేను హామీ ఇస్తున్నాను..’ కడప జిల్లాలో డిసెంబర్ 26న..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ప్రకటన చేశారు. డిసెంబర్ 26న కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవ సభలో జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. ‘జగన్ అనే నేను.. డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తాను.’ అని జగన్ ప్రకటించారు. 20వేల మందికి ఉపాధి కల్పించే కడప స్టీల్ ప్లాంట్‌ను మూడేళ్లలోనే పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీంతో పాటు డిసెంబర్ 26న మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తానని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కుందూ నది మీద రాజోలు - జలదరాశి ప్రాజెక్టులకు కూడా అదే రోజు కొబ్బరికాయ కొడతామన్నారు. కుంది నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నీటిని నింపుతామన్నారు.

‘గోదావరి జలాలను శ్రీశైలానికి తీసుకొస్తే రాయలసీమ ఎలా మారిపోతుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ దిశగా అడుగులు వేశాం. గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొచ్చి.. రాయలసీమ, ప్రకాశం జిల్లాకు నీరివ్వడానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు’ అని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

First published: July 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>