ఢిల్లీలో సీఎం జగన్ బిజీ బిజీ...గడ్కరీతో కీలక సమావేశం

నిన్న పార్లమెంట్‌ సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోదీతో సమావేశమై విభజన హామీల అమలుపై చర్చలు జరిపారు. ఏపీ ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా మరోసారి విజ్ఞప్తిచేశారు.

news18-telugu
Updated: August 7, 2019, 3:55 PM IST
ఢిల్లీలో సీఎం జగన్  బిజీ బిజీ...గడ్కరీతో కీలక సమావేశం
నితిన్ గడ్కరీతో జగన్ భేటీ
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న జగన్..రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. నితిన్ గడ్కరీతో సుమారు గంటపాటు చర్చించారు. భేటీలో ఏపీలో రహదారుల నిర్మాణంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జగన్ వెంట విజయసాయిరెడ్డితో పాటు పలువురు ఎంపీలు ఉన్నారు.

కాగా, నిన్న పార్లమెంట్‌ సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోదీతో సమావేశమై విభజన హామీల అమలుపై చర్చలు జరిపారు. ఏపీ ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా మరోసారి విజ్ఞప్తిచేశారు. ప్రత్యేక హోదాతో పాటు వాటర్ గ్రిడ్, కృష్ణా-గోదావరి అనుసంధానం, పరిశ్రమల రాయితీ, కడప స్టీల్‌ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>