అమిత్ షాతో సీఎం జగన్ భేటీలో చర్చించిన అంశాలివే...

రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. మూడు రాజధానులు, హైకోర్టు తరలింపు, శాసనమండలి రద్దు మీద ముఖ్యంగా చర్చ జరిపినట్టు సమాచారం.

news18-telugu
Updated: February 14, 2020, 10:56 PM IST
అమిత్ షాతో సీఎం జగన్ భేటీలో చర్చించిన అంశాలివే...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
 • Share this:
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ అమిత్ షాతో సుమారు అరగంట పాటు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ఎందుకు చేస్తున్నాము?. దానికి కారణాలను వివరించినట్టు తెలిసింది. మూడు రాజధానులు ఏర్పాటైతే హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయశాఖ ద్వారా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే, శాసనమండలి రద్దు అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇటీవల రాజధాని బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపడంతో సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా మండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసింది.

 • శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ శాసనసభ తీర్మానం చేసింది కాబట్టి, తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి


 • రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని హోంమంత్రికి తెలిపిన సీఎం

 • ఏపీ దిశా చట్టానికి ఆమోదం తెలిపాల్సిందిగా కోరిన సీఎం

 • పెండింగులో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాల్సిందిగా సంబంధిత శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని వినతి • వెనకబడ్డ జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకూ రూ.1050 కోట్లు మాత్రమే వచ్చాయి. గడచిన మూడేళ్లనుంచి దీనికి సంబంధించిన ఎలాంటి నిధులు రాలేదన్న విషయాన్ని హోంమంత్రి ముందు ఉంచిన సీఎం.
 • ప్రత్యేక ఆర్థిక సహాయం పొందుతున్న కలహండి, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి సగటున రూ.4000 ఇస్తే, ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాల్లో కేవలం రూ.400 మాత్రమే ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడ్డ జిల్లాలకు ఇస్తున్న ప్యాకేజీని కలహండి, బుందేల్‌ ఖండ్‌ తరహాలో విస్తరించాలని హోంమంత్రిని కోరిన సీఎం.

 • 2014–15 నాటికి ఈ రెవిన్యూ లోటును రూ. 22,949 గా కాగ్‌ నిర్ధారించింది. ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉంది. దీన్ని ఇప్పించాలి.

 • రాజధాని నిర్మాణంకోసం రూ.2500 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకూ రూ.1000 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బును విడుదల చేయాలి.

 • ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది. ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇవ్వాలని కోరిన సీఎం.

 • ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆర్థిక సహాయం అందించాలి.

 • రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికోసం కడప స్టీల్‌ పాంట్, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం– చెన్నై కారిడర్, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్‌కోసం తగిన ఆర్థిక సాయం చేయాలి

 • రాష్ట్రంలో సాగునీటి వసతి మెరుగుపరచడానికి గోదావరి నదిలో నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలంకు తరలించే ప్రాజెక్టుకూ తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరిన సీఎం. ఆమేరకు సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరిన ముఖ్యమంత్రి.

 • ఆంధ్రప్రదేవ్‌ పోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రాజెక్టును హోంమంత్రిత్వ శాఖ 2017లో ఆమోదించిందని, ఇందులో రూ.152 కోట్లు కేంద్రం ఇవ్వాలని, రూ. 101.4 కోట్లు రాష్ట్రం భరించాలని నిర్ణయించగా, రాష్ట్రంలో గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు మూతపడిన విషయాన్ని హోంమంత్రికి వివరించిన సీఎం.

 • శాంతిభద్రతలను కాపాడేందుకు, ప్రజల భద్రతకోసం గట్టి చర్యలను తీసుకునేందుకు వీలుగా ప్రస్తుతం కేడర్‌ స్ట్రెంత్‌ను 79 సీనియర్‌ డ్యూటీ పోస్టులను 96కు పెంచాలంటూ కోరిన సీఎం

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు