ఆ కమిటీతో సీఎం జగన్ భేటీ... ఏం జరుగుతోంది ?

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీతో సీఎం జగన్ భేటీ అయ్యారు.

news18-telugu
Updated: November 29, 2019, 11:56 AM IST
ఆ కమిటీతో సీఎం జగన్ భేటీ... ఏం జరుగుతోంది ?
సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ కేబినెట్ సబ్ కమిటీతో నిర్వహించిన సమావేశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలైనా అవినీతిని బయటపెట్టలేకపోయారని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ నిన్న అమరావతి పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కేబినెట్ సబ్‌కమిటీతో జగన్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అనంతరం త్వరలోనే నిజాలు నిగ్గు తేలుస్తామన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... గత ప్రభుత్వ హయంలో వేల కోట్ల అవినీతి జరిగిందని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారని... తాము అవినీతికి పాల్పడినట్టు నిరూపించలేకపోయారని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని సాధ్యమైనంత తొందరగా వెలికితీయాలని ఏపీ మంత్రులను సీఎం జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది.






First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>