ఏపీ మంత్రికి కొత్త టెన్షన్... జగన్ మనసులో ఏముంది..?

ఆయన తాజాగా చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన అవంతిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఒకప్పుడు ఆయనకు రాజకీయ గురువుగా ఉండి, ఆ తర్వాత ప్రత్యర్ధిగా మారిన గంటా శ్రీనివాసరావును చేరదీసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.

news18-telugu
Updated: October 14, 2019, 7:47 PM IST
ఏపీ మంత్రికి కొత్త టెన్షన్... జగన్ మనసులో ఏముంది..?
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)
news18-telugu
Updated: October 14, 2019, 7:47 PM IST
(సయ్యద్ అహ్మద్, విజయవాడ న్యూస్ 18 ప్రతినిధి)

ఏపీలో అధికార వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంట్రీపై కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. విశాఖ జిల్లాలో పార్టీ బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో గంటా వంటి నేతలను చేర్చుకోవడం ద్వారా బలపడాలని వైసీపీ ముఖ్యనేతలు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం వెనుక మరో కోణం కూడా ఉన్నట్లు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి అర్దమవుతోంది.

2009లో ప్రజారాజ్యంలో పనిచేసిన గంటా శ్రీనివాసరావు.. కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం తర్వాత మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన టీడీపీలోకి ఫిరాయించిన గంటా అక్కడా మంత్రి పదవి చేపట్టారు. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా అతి కష్టం మీద గట్టెక్కారు. అయితే గతంలో గంటా శ్రీనివాసరావుతో కలిసి ప్రజారాజ్యం పార్టీలోనూ ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీల్లో పనిచేసిన మరో నేత అవంతి శ్రీనివాస్ మాత్రం ఈసారి ఎన్నికలకు ముందు వైసీపీలోకి ఫిరాయించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలిచిన అవంతికి జగన్ కేబినెట్ లో పర్యాటక మంత్రి పదవి కూడా దక్కింది.

ap news,ap politics,andhra pradesh,avanthi srinivas,nara lokesh,ysrcp,tdp,telugu news,amaravati news,ap capital change,అవంతి శ్రీనివాస్, నారా లోకేష్, వైఎస్ఆర్సీపీ, వైసీపీ
అవంతి శ్రీనివాస్ (File)
అయితే ఆయన తాజాగా చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన అవంతిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఒకప్పుడు ఆయనకు రాజకీయ గురువుగా ఉండి, ఆ తర్వాత ప్రత్యర్ధిగా మారిన గంటా శ్రీనివాసరావును చేరదీసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అవంతి వ్యవహారమే కీలకంగా మారింది.

గత నెలలో విశాఖ నగరంలో ఓ స్ధల వివాదంలో స్ధానిక పారిశ్రామికవేత్తను కడప జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు ఇంటికెళ్లి బెదిరించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించడంతో పాటు సచివాలయంలో కొందరు మీడియా ప్రతినిధులకు సైతం ఈ వ్యవహారం లీక్ చేసినట్లు సమాచారం. అదే సమయంలో విశాఖ జిల్లాలో పులివెందుల పంచాయతీలు ఏమిటంటూ అసహనం కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు ప్రధాన పత్రికల్లో ఈ వ్యవహారంపై వార్తలు రావడం, స్ధల వివాదంలో పారిశ్రామికవేత్త ఇంటికి వెళ్లిన వ్యక్తులు పులివెందుల వారిగా వార్తలు రావడంతో ఇంటిలిజెన్స్ వర్గాలు దీనిపై దృష్టిసారించాయి. చివరికి సున్నితమైన ఈ వ్యవహారాన్ని పోలీసులకు చెప్పి బయటకు పొక్కకుండా పరిష్కరించకుండా మంత్రిగా ఉంటూ తానే పత్రికలకు లీక్ లు ఇచ్చారంటూ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో పాటు కొన్నిరోజులు మంత్రి అవంతికి సీఎం అపాయింట్ మెంట్ కూడా దొరకలేదని సమాచారం.

Ganta srinivasa rao son political entry, Ganta srinivasa rao son raviteja, ganta raviteja, Visakhapatnam, chandrababu, ap cm ys jagan, bjp, tdp, ysrcp, ap politics, ap news, రాజకీయాల్లోకి గంటా శ్రీనివాసరావు కుమారుడు, గంటా రవితేజ, విశాఖపట్నం, చంద్రబాబు, ఏపీ సీఎం జగన్
గంటా శ్రీనివాసరావు(ఫైల్ ఫోటో)
Loading...
ఓ దశలో అవంతిని మంత్రి పదవి నుంచి తప్పించాలని కూడా వైసీపీ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. అవంతి స్ధానంలో గంటాను వైసీపీలోకి తెస్తే విశాఖ జిల్లాలో పార్టీ బలపడటంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయని వారు భావించినట్లు సమాచారం. దీంతో గంటా రాకపై అవంతి అసహనం కూడా వ్యక్తం చేశారు. చివరికి గంటా చేరిక ఇప్పటివరకూ సాధ్యపడలేదు. అదే సమయంలో మంత్రి అవంతి కూడా తాజాగా సీఎం జగన్ నిర్వహించిన పర్యాటకశాఖ సమీక్షలో పాల్గొన్నారు కూడా. దీంతో అవంతి వ్యాఖ్యల వివాదం సద్దుమణిగిందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా వైసీపీలో గంటా రాక అంటూ జరిగితే దానికి అవంతి వ్యవహారం మాత్రం ప్రధాన కారణంగా మారేలా కనిపిస్తోంది.
First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...